బావిలో పడి వృద్ధుడి మృతి
జగిత్యాలరూరల్: జగిత్యాల రూరల్ మండలంలోని జాబితాపూర్‌కు చెందిన ఈదుల రామయ్య(70) బావిలో పడి మృతిచెందాడని ఎస్సై సదాకర్ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. రామయ్యకు కొంతకాలంగా కళ్లు కనిపించడం లేదు. మంగళవారం ఇంటికి సమీపంలోని తోట వద్దకు వెళ్తూ.. ప్రమాదవశాత్తు కాలు జారి, బావిలో పడ్డాడు. మృతుడి తమ్ముడు లింగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
చిట్‌ఫండ్ కంపెనీ చైర్మన్ అరెస్టు
సైదాపూర్: ఓ చిట్‌ఫండ్ కంపెనీ చైర్మన్‌ను చిట్టీ డబ్బుల ఎగవేత కేసులో అరెస్టు చేసినట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. హుజూరాబాద్‌లోని ఓ చిట్ ఫండ్ కంపెనీలో రాయికల్ గ్రామానికి చెందిన ఊసకోయిల వెంకటపతి రెండేళ్ల క్రితం రూ.10 లక్షల చిట్టీ వేశాడు. దాని కాలపరిమితి ముగిసింది. అయినా, కంపెనీ చైర్మన్ శ్రీనివాసరావు డబ్బులు ఇవ్వడం లేదని సైదాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి, శ్రీనివాసరావును మంగళవారం అరెస్టు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం
కొండగట్టు(చొప్పదండి): కొడిమ్యాల మండలం పూడూరు శివారులోని పొలం వద్ద మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై సందీప్ తెలిపారు. మృతుడి వివరాలు తెలిసినవారు తమకు సమాచారం అందించాలని కోరారు.
చికిత్స పొందుతూ యువకుడి మృతి
ముత్తారం(మంథని): మండలంలోని లక్కారా నికి చెందిన కురాకుల సాయికుమార్(22) చికి త్స పొందుతూ మృతిచెందాడు. ఎస్సై నరేశ్ వివరాల ప్రకారం.. కురాకుల సమ్మయ్య–కళావతి దంపతుల కుమారుడు సాయికుమార్ డిగ్రీ చదివాడు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని పలు పోటీ పరీక్షలు రాశాడు. ఒక్క ఉద్యోగం కూడా రాలేదన్న మనస్తాపంతో ఈ నెల 16న క్రిమిసంహారక మందు తాగాడు. కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment