జాతీయ సమైక్యత సదస్సుకు ఎంపిక
కరీంనగర్ సిటీ: ఈ నెల 3 నుంచి 9వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్‌లోని నర్సాపూర్‌లో జరిగే జాతీయ సమైక్యత సదస్సుకు పలువురు ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు ఎంపికై నట్లు శాతవాహన యూనివర్సిటీ రిజిస్ట్రార్ రవికుమార్ తెలిపారు. అగ్రహారం ప్రభుత్వ డిగీ కాలేజీ నుంచి సాయికిరణ్, ఎస్‌ఆర్‌ఆర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీ నుంచి అజయ్, శాతవాహన యూనివర్సిటీ కామర్స్ విభాగం నుంచి అరుణ్, మధులత, జగిత్యాల ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నుంచి మానస ఎంపికై నట్లు పేర్కొన్నారు. వీరిని శనివారం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అభినందించారు. ఎన్‌ఎస్‌ఎస్ సమన్వయకర్త మనోహర్, అధికారి విజయ్‌కుమార్ పాల్గొన్నారు.
ఆభరణాలు, నగదు, ఫోన్లు చోరీ
కథలాపూర్: ఇంట్లో చొరబడిన దుండగులు బంగారు ఆభరణాలు, నగదు, ఫోన్లు చోరీ చేశారు. బాధితుల వివరాల ప్రకారం.. కథలాపూర్ మండలంలోని భూషణరావుపేటకు చెందిన వెలుగూరి భాస్కర్ ఇంట్లోనే కిరాణం నిర్వహిస్తున్నాడు. చిన్న సెల్‌ఫోన్లు కూడా విక్రయిస్తుంటాడు. శనివారం వేకువజామున ఓ గది తాళం పగులగొట్టిన గుర్తు తెలియని వ్యక్తులు బీరువాలోని 4 తులాల బంగారు ఆభరణాలు, రూ.50 వేలు, కిరాణంలోని రూ. 35 వేల విలువైన 12 సెల్‌ఫోన్లు ఎత్తుకెళ్లారు. ఎస్సై నవీన్‌కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. చోరీ జరిగిన ఇంటి ఆవరణలో సీసీ కెమెరాలు ఉండటంతో ఫుటేజీ పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment