సారంగాపూర్: సారంగాపూర్ సింగిల్ విండో పరిధిలోని పోతారం గ్రామ కొనుగోలు కేంద్రం ని ర్వాహకులు చేతివాటం ప్రదర్శించారు. రైతులు వానాకాలంలో విక్రయించిన డబ్బులను వారివారి ఖాతాల్లోకి దారిమళ్లించుకున్నారు. పోతారం శివారు గ్రామం గణేశ్‌పల్లిలో సింగిల్ విండో ఆద్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గణేశ్‌పల్లికి చెందిన 11 మంది రైతులు 550 బస్తాల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో విక్రయించారు. వీరికి సుమారు రూ.5,10,400 చెల్లించాల్సి ఉంది. రెండు నెలలు గడుస్తున్నా డబ్బులు ఖాతాల్లో జమకాకపోవడంతో అనుమానం వచ్చిన రైతులు పలు మార్లు సింగిల్ విండో కార్యాలయంలో అడిగారు. అధికారుల నుంచి స్పందన కరువవడంతో రైతులు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. కేంద్ర నిర్వాహకులు ట్యాబ్ ఎంట్రీదారుడిని విచారి ంచగా 220 క్వింటాళ్ల ధాన్యం డబ్బులు రూ. 5,10,400 నిర్వాహకుల ఖాతాల్లో చేరాయని గుర్తించారు. దీంతో సదరు రైతులకు సింగిల్ విండో ఖా తా నుంచి డబ్బులు చెల్లించింది. అయితే తమ ఖా తాల్లోకి మార్చుకున్న డబ్బులపై తాము తిరిగి సింగిల్ విండోకు చెల్లించేలా నిర్వాహకులు అధికారులకు అంగీకారపత్రం రాసి ఇవ్వడం విశేషం.
తమ ఖాతాల్లో జమ చేసుకున్న నిర్వాహకులు
11 మంది రైతుల రూ.5,10,400 దారి మళ్లింపు
ఎమ్మెల్సీ ఫిర్యాదుతో విచారణ
సింగిల్ విండో ఖాతా నుంచి చెల్లింపు
Comments
Please login to add a commentAdd a comment