కుంభమేళా నుంచి ఎట్టకేలకు ఇంటికి
● తొలుత రైలులో వరద వెళ్లి, తిరిగి వరంగల్‌కు..
● పోలీసుల సహాయంతో జగిత్యాల చేరిన మహిళలు
జగిత్యాల క్రైం: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు వెళ్లి, తప్పిపోయిన మహిళలు ఎట్టకేలకు ఇంటికి చేరారు. ఈ ప్రయాణంలో నానాతంటాలు పడినట్లు వారు తెలిపారు. బాధితుల వివరాల ప్రకారం.. జగిత్యా ల, కడెం, ఖానాపూర్‌కు చెందిన 11 మంది మహిళలు గత నెల 27న కుంభమేళాకు ప్రైవేటు బస్సు లో బయలుదేరి వెళ్లారు. 29న ప్రయాగ్‌రాజ్‌లోని సంగం ఘాట్ వద్దకు చేరుకున్నారు. గంగస్నానం చేయడానికి గ్రూపులుగా విడిపోయారు. అక్కడి జనసందోహంలో జగిత్యాల విద్యానగర్‌కు చెందిన వీర్ల నర్సవ్వ, కొత్తవాడకు చెందిన ఆది రాజ వ్వ, నిర్మల్ జిల్లా కడెంకు చెందిన ఏనుగు బుచ్చ వ్వ, బెల్లపు సత్తవ్వలు తప్పిపోయారు. మిగతా వారు కలవకపోవడంతో ఈ నలుగురూ సుమారు 20 కి.మీ. వెళ్లారు. ఎక్కడ వెతికినా తమవారు కనిపించలేదని అక్కడి పోలీసులకు చెప్పారు. కానీ, ఈ మహిళలు ఏం చెబుతున్నారో వారికి అర్థం కాలేదు. అక్కడ తెలుగు వచ్చిన ఓ వ్యక్తి కని పించాడు. బాధితుల వద్ద రూ.1,200 ఉండటంతో అతను వారిని రైల్వేస్టేషన్‌కు తీసుకెళ్లి, వరంగల్‌కు టికెట్లు కొనిచ్చి, రైలు ఎక్కించాడు. అయితే, ఆ మహిళలకు వరంగల్‌లో దిగే సమయం తెలియకపోవడం వల్ల వరద వరకు వెళ్లిపోయారు. అక్కడి నుంచి తిరిగి వరంగల్ చేరుకున్నారు. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి, జరిగిన విషయం చెప్పడంతో.. పోలీ సులు వారికి భోజనం పెట్టించి, జగిత్యాల పంపే ఏర్పాట్లు చేశారు. బాధితులు శనివారం ఇల్లు చేరడంతో వారి కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. తమ కుటుంబసభ్యులు ఇంటికి చేరేవరకు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకున్న ఎస్పీ అశోక్‌కుమార్, మెట్‌పల్లి డీఎస్పీ రాములకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment