యువతి కుటుంబీకులతో మాట్లాడుతున్న అధికారులు, అంబులెన్సులో యువతిని తరలింపు
బనశంకరి: బెంగళూరు నగరంలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. జ్యోతిష్యుని మాటలు విని యువతిని ఇంట్లో బంధించి చిత్రహింసలు పెట్టిన ఘటన లగ్గెరెలో చోటుచేసుకుంది. 26 ఏళ్ల యువతిని బెంగళూరు ఉత్తరవలయ శిశుసంక్షేమ యోజనాధికారి శశిధర్, సిబ్బంది కాపాడి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
భోజనం లేకుండా నీళ్లు మాత్రమే
చెన్నరాయపట్టణ మాదేహళ్లి గ్రామానికి చెందిన యువతి డిగ్రీ పూర్తిచేసింది. యువతికి నాలుగునెలల క్రితం వెన్నునొప్పి ప్రారంభమైంది. ఆమె కుటుంబీకులు వైద్యులకు బదులుగా జ్యోతిష్యున్ని ఆశ్రయించారు. కానీ సమస్య తీరకపోగా ఇంకా తీవ్రమైంది. కుటుంబ సభ్యులు ఆమెకు మూడు నెలలుగా పసుపునీరు, నిమ్మకాయరసం మాత్రమే తాగిస్తున్నారు, భోజనం పెట్టడం లేదు. నెలక్రితం ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ సమయంలో యువతికి క్యాన్సర్ ఉన్నట్లు తెలిసింది. అప్పటికీ ఆస్పత్రిలో చేర్పించలేదు. ఇంట్లోనే ఉంచి సతాయించడంతో మానసికంగా, శారీరకంగా బాగా దెబ్బతినింది. ఇంట్లో నాలుగుగోడల మధ్య బంధించి చిత్రహింసలు పెట్టారు. పొట్ట ఉబ్బి ఇబ్బంది పడుతున్నా మందులు ఇవ్వలేదు. కడుపు నొప్పిని తట్టుకోలేక కేకలు వేసేది. చివరకు మొబైల్‌ఫోన్‌లో తెలిసినవారికి నన్ను కాపాడి సహాయం చేయండి అని మెసేజ్‌లు చేసింది. దీంతో జనం చేరుకుని అధికారులకు సమాచారమిచ్చారు. ఇంజిన్ ఆయిల్, నిమ్మరసం తాగించాలని చెప్పిన నకిలీ జ్యోతిష్యున్ని పట్టుకుని జనం చితకబాదారు.
మూఢనమ్మకాలతో యువతికి నరకం
కాపాడిన స్థానికులు, అధికారులు
Comments
Please login to add a commentAdd a comment