మైసూరు: మైసూరు కేంద్ర కారాగారంలో మత్తు కోసం బేకరీ ఎసెన్స్ తాగి మరణించిన ముగ్గురు ఖైదీల మృతదేహాల నుంచి పలు శాంపిల్స్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించామని, అక్కడి నుంచి నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి కారణం తెలుస్తుందని మైసూరు కేఆర్ ఆస్పత్రి వైద్యుడు దినేష్ తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముగ్గురు ఖైదీలూ ఎసెన్స్ సేవనంతోనే మరణించారని ఇప్పుడే చెప్పలేమన్నారు. ఈ ఖైదీలు జైలులోని బేకరీలో పనిచేసేవారు. వాంతులు, విరేచనాలు చేసుకుని కేఆర్ ఆస్పత్రిలో చేరారన్నారు. ఎసెన్స్ తాగినట్లు చాలాసేపటి వరకు చెప్పలేదన్నారు. ఫుడ్ పాయిజన్ అయి ఉండవచ్చని భావించి తాము చికిత్స అందించామన్నారు. ఒకే రోజులో అవయవాల వైఫల్యం జరిగిందన్నారు. చిట్టచివరకు రమేష్ అనే ఖైదీ ఎసెన్స్ సేవనం గురించి నోరువిప్పాడన్నారు. అయితే ఎంత ప్రమాణంలో తాగాడో తెలుసుకునేందుకు వీలు కాలేదన్నారు. ఎందుకంటే ముగ్గురూ కూడా ఐసీయూలో ఉండేవారన్నారు. ఎసెన్స్ ప్రభావం వల్ల వారికి చెవులు వినిపించలేదన్నారు. కీమో డయాలసిస్ చేశామన్నారు. ఏవైనా డ్రగ్స్ సేవించారా? అనేది పరీక్షించామని, సేవించలేదని వెల్లడైందన్నారు. వైద్యసేవల గురించి వెల్లూరు ఆస్పత్రి, బెంగళూరు వైద్యులతో చర్చించామని ఆయన తెలిపారు.
ఫోరెన్సిక్ ల్యాబ్‌కు శాంపిల్స్
Comments
Please login to add a commentAdd a comment