వైకుంఠ ఏకాదశికి ముస్తాబు
బనశంకరి: హిందూభక్తులు పరమ పవిత్రంగా భావించే వైకుంఠ ఏకాదశికి వైష్ణవ ఆలయాలు ముస్తాబయ్యాయి. సందర్భంగా బెంగళూరు నగరంతో పాటు రాష్ట్రంలోని విష్ణు, వెంకటేశ్వరుని ఆలయాల్లో శుక్రవారం ప్రత్యేక పూజలు జరగనున్నాయి. ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనాలు కల్పిస్తారు. అనేక ఆలయాల్లో తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు దర్శనానికి అవకాశం కల్పించారు. బెంగళూరు టీటీడీ, చామరాజపేటే కోటే వెంకటేశ్వరస్వామి, వసంతపుర వసంత వల్లభరాయ ఆలయం, ఇస్కాన్ టెంపుల్, పద్మనాభనగర తిరుమలగిరి లక్ష్మీవెంకటేశ్వర దేవస్థానం తదితర అనేక ఆలయాలను శోభాయమానంగా అలంకరించారు. బారికేడ్లు, ప్రత్యేకంగా వైకుంఠ ద్వారాలను నిర్మించారు.
Comments
Please login to add a commentAdd a comment