బనశంకరి: రాజీవ్‌గాంధీ మెడికల్ యూనివర్శిటీకి అదనంగా విడుదలైన నిధులతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో సౌకర్యాలను కల్పించాలని వైద్య విద్యా మంత్రి శరణప్రకాష్ పాటిల్ కు సీఎం సిద్దరామయ్య సూచించారు. గురువారం సీఎం గృహకార్యాలయమైన కృష్ణాలో సమావేశమై చర్చించారు. రాష్ట్రంలో క్యాన్సర్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయో అధ్యయనం చేయాలని, క్యాన్సర్ చికిత్సకు అంతర్జాతీయ ప్రమాణాలతో చికిత్స అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఏడాదిలో మెడికల్ కాలేజీలలో పరికరాలు కొనుగోలుకు రూ.400, కోట్లు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి రూ.130 కోట్లు కేటాయించామని, ఈ పనులను తొందరగా పూర్తి చేయాలన్నారు. గదగ, కొప్పళ, కారవార, కొడగుజిల్లాల్లో నిర్మాణంలో ఉన్న 450 పడకల ఆసుపత్రుల నిర్మాణం శీఘ్రమే పూర్తిచేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment