మోపెడ్‌ను ఆర్టీసీ బస్సు ఢీ
దొడ్డబళ్లాపురం: రామనగర తాలూకాలోని కనకపుర–రామనగర రోడ్డులో గురువారంనాడు ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అతివేగంగా కేఎస్ ఆర్టీసీ బస్సు టీవీఎస్ మోపెడ్‌ని ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు పిల్లలు చనిపోగా, ఇద్దరు పెద్దలు తీవ్రంగా గాయపడ్డారు. ప్రదీప్ (5), భవ్య (3) మృతులు.
మృతులు తమిళనాడు డెంకణీకోట తాలూకా బోకసంద్ర గ్రామానికి చెందిన భైరప్ప పిల్లలుగా గుర్తించారు. భైరప్ప పిల్లలను రామనగర తాలూకా అచ్చలుదొడ్డి కాలనీ గ్రామంలోని బంధువు గోవిందప్ప ఇంటికి పంపించాడు. గురువారం ఉదయం గోవిందప్ప మోపెడ్‌లో ఇద్దరు పిల్లలను, స్నేహితుడు మధుని ఎక్కించుకుని కోళ్లఫారానికి బయలుదేరాడు. దారి మలుపులో కనకపురకు వెళ్తున్న కేఎస్‌ఆర్టీసీ బస్సు ఢీకొంది. పిల్లలు తీవ్ర గాయాలతో అక్కడే మరణించారు. గోవిందప్ప, మధు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను మండ్య జిల్లా ఆస్పత్రికి తరలించారు. రామనగర గ్రామీణ పోలీసులు బస్సును సీజ్ చేసి డ్రైవర్‌ను అరెస్టు చేశారు.
ఇద్దరు పిల్లల దుర్మరణం
రామనగర వద్ద విషాదం
Comments
Please login to add a commentAdd a comment