దొడ్డబళ్లాపురం: మైనింగ్‌పై కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అధిక పన్నులు వేస్తోందని, దీని ప్రభావం మైనింగ్, ఉక్కు పరిశ్రమలపై పడుతోందని కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్‌కు ఫిర్యాదు చేశారు. ఢిల్లీలో గురువారంనాడు భారీ పరిశ్రమల సచివాలయంలో సమావేశం జరిగింది. గనుల శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం గనుల తవ్వకాలపై విపరీతంగా సుంకాలను విధిస్తోందని పలువురు ఫిర్యాదు చేశారు.
ఐపీఎస్ కేసులో కుమారకు ఊరట
కేంద్రమంత్రి హెచ్‌డీ కుమారస్వామిపై ఏడీజీపీ చంద్రశేఖర్ బెంగళూరు సంజయ్‌నగర పోలీస్‌స్టేషన్‌లో తనను బెదిరిస్తున్నారని గతంలో ఫిర్యాదు చేశారు. మైనింగ్ కేసుల్లో దర్యాప్తు అధికారులను బెదిరించే విధంగా, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడారని ఫిర్యాదు చేయగా ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ కేసును కొట్టివేయాలంటూ
హెచ్‌డీ కుమారస్వామి, నిఖిల్ కుమారస్వామి, సురేశ్ బాబు ముగ్గురూ హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ జరిపిన కోర్టు జనవరి 30 వరకు కుమారస్వామి తదితరులపై పోలీసులు ఎటువంటి బలవంతపు చర్యలూ తీసుకోరాదని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment