నగరసభ కమిషనర్, ఇంజినీరు పట్టివేత
యశవంతపుర: హాసనాంబ ఆలయంలో పనులు చేసిన కాంట్రాక్టర్ నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటూ హాసన్ నగరసభ కమిషనర్, ఎఇఇ లోకాయుక్త వలలో పడ్డారు. రెండు నెలల కిందట హాసనాంబ జాతర మహోత్సవం జరిగింది. ఆ సమయంలో చెత్తను తొలగించడం, శుభ్రతా పనులను ఓ కాంట్రాక్టరు నిర్వహించారు. ఇందుకు గాను రూ.10.50 లక్షల బిల్లులు విడుదల చేయడానికి రూ.1.50 లక్షల లంచం ఇవ్వాలని కమిషనర్ నరసింహమూర్తి, ఎఇఇ కెఆర్ వెంకటేశ్ డిమాండ్ చేశారు. కాంట్రాక్టరు నుంచి గురువారం మొదటి విడతగా రూ.50 వేలు తీసుకుంటూ ఉండగా, లోకాయుక్త ఇన్స్‌పెక్టర్లు బాలు, శిల్పా దాడి చేసి కమిషనర్‌ను పట్టుకున్నారు. అతనితో పాటు వెంకటేశ్‌ను అరెస్టు చేశారు. దాడి సమయంలో అక్కడే ఉన్న నగరసభ సభ్యుడు వెంకటేశ్వర.. అధికారులు అలాంటివారు కాదంటూ, వారు ఏం తప్పు చేశారని ఇన్స్‌పెక్టర్లతో వాదనకు దిగాడు. లంచం తీసుకోవడం నేరమని వెంకటేశ్వరను గట్టిగా మందలించడంతో మౌనం దాల్చాడు.
Comments
Please login to add a commentAdd a comment