శివాజీనగర: మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ గురించి బెళగావి అసెంబ్లీలో అసభ్యంగా మాట్టాడారనే కేసులో బీజేపీ ఎమ్మెల్సీ సీటీ రవి సీఐడీ విచారణకు హాజరయ్యారు. నోటీసుల ప్రకారం గురువారం బెంగళూరులోని సీఐడీ కార్యాలయానికి వచ్చారు. ఆ వ్యాఖ్యలు చేసిన వెంటనే సీటీ రవిని పోలీసులు అరెస్టు చేసి రాత్రంతా రహస్య ప్రదేశంలో ఉంచడం తెలిసిందే. ఆ తరువాత సీ.టీ.రవి బెయిల్‌పై విడుదలయ్యారు. కేసును రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ తనిఖీకి అప్పగించింది. అలాగే డిసెంబరు 19న బెళగావి సువర్ణసౌధలో ఎమ్మెల్సీ సీ.టీ.రవిపై దాడి చేశారనే కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఎస్.వీ.సంకనూరు, డీ.ఎస్.అరుణ్, కిశోర్ కుమార్ పుత్తూరులకు సీఐడీ అధికారులు విచారణకు రావాలని నోటీస్ ఇచ్చారు. దీంతో గురువారం సాయంత్రం విచారణకు వచ్చారని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment