యశవంతపుర: రౌడీషీటర్ కారులో వెళ్తుండగా దుండగులు కాల్పులు జరిపిన ఘటన బెళగావి గ్రామాంతర పోలీసుస్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం జరిగింది. బెళగావి శాహునగరకు చెందిన ప్రపుల్ పటేల్‌పై రౌడీషీట్ నమోదైంది. ఈయన తన కారును డ్రైవ్ చేసుకుంటూ బెళగుందిలోని తన ఇంటికి వెళ్తుండగా దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారు. తుటా కారు అద్దాలకు తగలడంతో ప్రపుల్ పటేల్ తృటిలో ప్రాణాలతో బయట పడ్డాడు. కాల్పుల ఘటన సమీపంలో అమర్చిన సీసీ కేమరాలో రికార్డు అయ్యింది. రూరల్ పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు.
సీఐడీ విచారణకు హాజరు
దొడ్డబళ్లాపురం: ఆత్మహత్య చేసుకున్న కాంట్రాక్టర్ సచిన్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 5మంది నిందితులు శుక్రవారం సీఐడీ విచారణకు హాజరయ్యారు. సచిన్ డెత్‌నోట్‌లో 8మంది పేర్లను పేర్కొంటూ తన ఆత్మహత్యకు వారే కారణమని ఆరోపించాడు. ఈ నేపథ్యంలో బీదర్ సీఐడీ అధికారులు 5మది నిందితులకు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరవ్వాలని కోరారు. గోరకనాథ్ సజ్జన్,నందకుమార్,రాజు,రామనగౌడ,సతీష్ విచారణకు హాజరయ్యారు.
టెన్త్, పీయూ పరీక్షల
వేళాపట్టిక విడుదల
శివాజీనగర: ఎస్‌ఎస్‌ఎల్‌సీ, ద్వితీయ పీయూసీ పబ్లిక పరీక్షకు ఫైనల్ టైమ్ టేబల్‌ను కర్ణాటక పాఠశాల పరీక్ష, స్పాట్ వాల్యువేషన్ నిర్ణయ మండలి వెల్లడించింది. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్ష–1, మార్చి 1 నుంచి మార్చి 20 వరకు ద్వితీయ పీయూసీ–1 పరీక్షలు జరుగనున్నాయి.
ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్ష–1 టైబ్ టేబల్:
మార్చి 21 ప్రథమ భాష, మార్చి 24న గణితం, 26న ద్వితీయ భాష, మార్చి 29న సాంఘిక శాస్త్రం, ఏప్రిల్ 2న సైన్స్, ఏప్రిల్ 4న తృతీయ భాష
ద్వితీయ పీయూసీ పరీక్ష–1 టైమ్ టేబల్:
మార్చి 1న కన్నడ, అరబిక్, మార్చి 3న గణితం, విద్యాశాస్త్రం, తర్కశాస్త్రం, లావాదేవీల అధ్యయనం, మార్చి 4న తమిళు, తెలుగు, మలయాళం, మరాఠి, ఉర్దూ, సంస్కృత, ఫ్రెంచ్ పరీక్ష, మార్చి 5న రాజనీతి శాస్త్రం, సంఖ్యా శాస్త్రం, మార్చి 7న చరిత్ర, భౌతిక శాస్త్రం, మార్చి 10న ఐచ్ఛిక కన్నడ, లెక్కశాస్త్రం, భూగర్భ శాస్త్రం, గృహ విజ్ఞానం, మార్చి 12న మనఃశాస్త్రం, రసాయన శాస్త్రం, గణితం, మార్చి 13న అర్థశాస్త్రం, మార్చి 15న ఇంగ్లిష్, మార్చి 17న భూగోళ శాస్త్రం, మార్చి 18న జీవశాస్త్రం, మార్చి 19న హిందూస్థాని సంగీతం, మార్చి 20న హిందీ పరీక్ష జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment