రేపు కొత్త బస్టాండ్ ప్రారంభోత్సవం
హుబ్లీ: నగరంలో నడిబొడ్డున జిల్లా కేంద్ర పాతబస్టాండ్ స్థలంలో కొత్తగా నిర్మించిన అత్యాధునిక వసతులతో కూడిన కొత్త బస్టాండ్‌ను ఈనెల 12న ప్రారంభానికి సంబంధిత స్మార్ట్ సిటీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. హుబ్లీ ధార్వాడ స్మార్ట్ సిటీ పథకం ద్వారా రూ.42 కోట్ల వ్యయంతో ఈ బస్టాండ్ నిర్మాణానికి 2022 జూన్‌లో శ్రీకారం చుట్టారు. వాస్తవంగా ఆ ఏడాది ఆగస్టులోనే పూర్తి కావాల్సి ఉన్నా వివిధ కారణాల వల్ల గత నెలాఖరుకు విస్తరించారు. ఈ బస్టాండ్ అందుబాటులో లేకపోవడంతో జిల్లా ప్రజలు ప్రయాణాల కోసం చాలా ఇబ్బందులు పడ్డారు. కాగా బస్టాండ్ ప్రారంభోత్సవంలో జాప్యంపై స్థానికుల నుంచి ఆగ్రహం వ్యక్తం కావడంతో ఎట్టకేలకు ఈ బస్టాండ్ ప్రారంభం ముహూర్తం ఈ నెల 12న నిర్ణయించినట్లుగా సంబంధిత అధికారుల నుంచి తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment