ఇద్దరు నిందితుల అరెస్ట్ ●
● 10 తులాల బంగారం స్వాధీనం
బళ్లారిఅర్బన్: కౌల్‌బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం సాయంత్రం రూపనగుడి రోడ్డు హులిగమ్మ గుడి వద్ద నివాసం ఉండే అరీఫ్, తౌసిఫ్(లాలు) అనే ఇద్దరు కలిసి 10 తులాల బంగారాన్ని కౌల్‌బజార్ ప్రాంతంలో విక్రయిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయట పడింది. వారి నుంచి రూ.6 లక్షల విలువ చేసే 10 తులాల బంగారం స్వాధీనం చేసుకొని ఇద్దరిని రిమాండ్‌కు తరలించినట్లు కౌల్‌బజార్ సీఐ సుభాష్‌చంద్ర తెలిపారు. గతంలో బ్రూస్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బంగారం చోరీ కేసులోని 6 మందితో పాటు జైలులో శిక్ష అనుభవించి బెయిల్‌పై బయటకు వచ్చినట్లు తెలిపారు. అయితే వారు దాచి ఉంచిన కొంత బంగరాన్ని మాత్రం తీసుకొచ్చి ఈ ప్రాంతంలో అమ్ముతున్న విషయం తెలుసుకున్న పోలీసులు దాడి చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కౌల్‌బజార్ ఎస్‌ఐలు శ్యామియల్, సోమప్ప, లింగప్ప, సిబ్బంది నాగరాజు, అన్వర్, క్రైం సిబ్బందిని ఎస్పీ శోభరాణి, ఏఎస్పీలు రవికుమార్, నవీన్‌కుమార్, డీఎస్పీ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment