ఎడ్లబండిని ఢీకొన్న బైక్
● తల్లీకుమారుడు దుర్మరణం
దొడ్డబళ్లాపురం: రోడ్డు ప్రమాదంలో తల్లీ కుమారుడు మృతిచెందిన సంఘటన హావేరి జిల్లా హిరేకెరూరు తాలూకా కోడ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. బ్యాడగి తాలూకా కెరూడి గ్రామ నివాసులైన తల్లీ కుమారుడు కుసుమ(56),కుమార్(34)లు హంసభావిలోని బంధువుల ఇంటికి బైక్‌పై బయల్దేరారు. కోడ గ్రామం వద్ద రోడ్డు పక్కన ఆపి ఉన్న ఎద్దుల బండిని బైక్ ఢీకొనడంతో ఇద్దరూ తీవ్ర గాయాలతో మృతి చెందారు. కేసు దర్యాప్తులో ఉంది.
గౌరీలంకేశ్ హత్య కేసులో నిందితుడికి బెయిల్
బనశంకరి: ప్రముఖ పాత్రికేయురాలు గౌరీలంకేశ్ హత్య కేసులో శరద్‌బాహు సాహేబ్ కలాస్కార్ అనే నిందితుడికి శుక్రవారం సిటీ సివిల్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి మురళీధర్ పై బెయిల్ మంజూరు చేశారు. దీంతో గౌరీలంకేశ్ హత్య కేసులో అరెస్టయిన 18 మందిలో 15వ నిందితుడు వికాస్ పటేల్ పరారీలో ఉండగా మిగిలిన వారికి బెయిల్ మంజూరైనట్లయింది.
ఆశాలకు గౌరవ వేతనం పెంపు
బనశంకరి: డిమాండ్ల సాధనకు ఆశా కార్యకర్తలు చేపట్టిన అహోరాత్రి ధర్నాకు ఫలితం దక్కింది. వీరి డిమాండ్లలో ఒకటైన వేతనం పెంపునకు సీఎం సిద్దరామయ్య సమ్మతించారు. దీంతో ఆశాకార్యకర్తలు ఆందోళన విరమించారు. శుక్రవారం ఆశాకార్యకర్తల సంఘం నేతలతో సీఎం సిద్దరామయ్య సమావేశమై వారి డిమాండ్లను ఆలకించారు. గౌరవవేతనం పెంపునకు సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.
ఎమ్మెల్యే కారు డ్రైవర్ ఆత్మహత్య
యశవంతపుర: గదగ్ జిల్లా శిరహట్టి బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ చంద్రు లమాణి కారు డ్రైవర్ సునీల్ లమాణి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గదగ్ జిల్లా లక్షేశ్వర పట్టణంలోని మల్లాడ్ కాలనీలోని ఎమ్మెల్యే ఇంటిలో ఈ ఘటన జరిగింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ ఆత్మహత్యకు దారితీసిన కారణాలు తెలియడం లేదు. కాగా ఈ ఇంటిని ఇటీవల ఎమ్మెల్యే చంద్రు లమాణి కొనుగోలు చేసినట్లు సమాచారం.
విచారణకు హాజరైన
నిందితులు
దొడ్డబళ్లాపురం: రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్, పవిత్రగౌడలతో సహా 17మంది నిందితులు శుక్రవారం 57వ సీసీహెచ్ కోర్టులో హాజరయ్యారు. గతంలో జరిగిన విచారణ సమయంలో నిందితులు అందరూ హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. ఆదేశాల ప్రకారం శుక్రవారం నిందితులు అందరూ కోర్టుకు హాజరయ్యారు. వాదోపవాదాలు విన్న కోర్టు విచారణను ఈనెల 25కి వాయిదా వేసింది.
పవిత్రగౌడను ఓదార్చిన దర్శన్:
జైలుపాలై బెయిలుపై విడుదలైన దర్శన్,పవిత్రగౌడ ఇదే మొదటిసారి ముఖాముఖి ఎదురుపడ్డారు. ప్రత్యక్షదర్శుల సమాచారం ప్రకారం దర్శన్ పవిత్రగౌడ ఆరోగ్యం గురించి అడిగి ధైర్యంగా ఉండాలని వెన్నుతట్టి ఓదార్చినట్టు తెలిసింది. మరోవైపు పవిత్రగౌడ పక్క రాష్ట్రంలోని దేవాలయానికి వెళ్లడానికి నెల రోజులు అనుమతి కావాలని కోరుతూ కోర్టులో పిటిషన్ వేసుకున్నారు.
మరోమారు మైసూరుకు దర్శన్
దర్శన్‌కు హైకోర్టులో ఊరట దక్కింది. మరోసారి మైసూరుకు వెళ్లడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. జనవరి 12 నుంచి 5 రోజులపాటు దర్శన్ మైసూరు వెళ్లవచ్చని కోర్టు అనుమతిచ్చింది. ఏ1గా ఉన్న పవిత్రగౌడకు ముంబై, ఢిల్లీ వెళ్లడానికి కూడా కోర్టు అనుమతించింది.
Comments
Please login to add a commentAdd a comment