నేలరాలిన విద్యా కుసుమం
బనశంకరి: చదువుల ఒత్తిడి, అధ్యాపకుల వేధింపులు మరో విద్యా కుసుమాన్ని బలిగొన్నాయి. భవిష్యత్తులో గొప్ప ఇంజినీర్ కావలసిన యువకుడు విగతజీవిగా మారాడు. ఓ ప్రైవేటు కాలేజీ 6వ అంతస్తుపై నుంచి దూకి ఇంజినీరింగ్ విద్యార్ది ఆత్మహత్య చేసుకున్న ఘటన ఐటీ నగరంలో పరప్పన అగ్రహార పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మృతుడు కరసాల రాహుల్ (21).
ఏం జరిగిందంటే..
వివరాలు.. రాహుల్ కుటుంబం కర్నూలుకు చెందిన ది కాగా, బళ్లారిలో స్థిరపడింది. అతని తండ్రి విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నారు. రాహుల్ ఎలక్ట్రానిక్ సిటీలోని పీఈఎస్ యూనివర్శిటీలో బీఈ కంప్యూటర్ సైన్సు మూడవ సంవత్సరం చదువుతున్నాడు. రాహుల్ తల్లితో కలిసి క్యాంపస్ నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. బుధవారం ఉదయం 8.30 గంటలకు కాలేజీలో పరీక్ష ఉండగా ఆలస్యంగా వచ్చాడని అధ్యాపకులు అనుమతించలేదు. తల్లికి కూడా సమాచారం అందించారు. ఈ పరిణామాలతో తీవ్ర మనోవేదనకు లోనైన రాహుల్ కాలేజీ 6వ అంతస్తుపైకి వెళ్లి కిందికి దూకాడు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఘటనాస్థలానికి పరప్పన అగ్రహార పోలీసులు చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసుకుని మృతదేహానికి విక్టోరియా ఆసుపత్రికి తరలించారు.
పరీక్షకు లేటుగా వచ్చాడని తిరస్కృతి
కాలేజీ పై నుంచి దూకి బీటెక్
విద్యార్థి ఆత్మహత్య
Comments
Please login to add a commentAdd a comment