దొడ్డబళ్లాపురం: రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ, జేడీఎస్ కూటమి ప్రభుత్వం వస్తుందని కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి అన్నారు. చెన్నపట్టణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు ఆగ్రహంగా ఉన్నారన్నారు. జిల్లా పేరు మార్చడం, కబ్జాలు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారని కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు. చెన్నపట్టణ–రామనగరలను జంట నగరాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. వాల్మీకి అభివృద్ధి మండలిలో అవినీతి చేసి గత లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లు కొన్నారని ఆరోపించారు. చెన్నపట్టణ ఉప ఎన్నికల్లో నిఖిల్‌ను ఓడించడానికి కాంగ్రెస్ నాయకులు పెద్దఎత్తున కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అయితే ప్రజల అభిమానం ముందు ఇవన్నీ పనికిరావన్నారు. శిగ్గాంవిలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి అజీంపీర్ ఖాద్రిని కిడ్నాప్ చేసి పోటీ నుంచి తప్పుకునేలా చేశారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment