మైసూరు జిల్లాలో ఘోరం
మైసూరు: జిల్లాలోని హుణసూరు తాలూకా హిండ్లగూడు గ్రామానికి చెందిన 17 ఏళ్ల వయస్సుగల ఓ అమ్మాయి అనుమానాస్ప రీతిలో మరణించింది. వివరాలు..పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న యువతి ఓ యువకున్ని (23) ప్రేమిస్తోంది. తమ కుమార్తె వేరే కులానికి చెందిన యువకుడిని ప్రేమిస్తున్న విషయం తెలిసి తల్లిదండ్రులు ఆమెను కాలేజీ మాన్పించి ఇంటికే పరిమితం చేశారు. వేరే పెళ్లి చేయాలని ప్రయత్నిస్తున్నారు.
దీంతో ఆ యువతి ఈనెల 4న ఇల్లు వదిలి ప్రియునితో పరారైంది. మైసూరులో ప్రియుని బంధువుల ఇంట్లో తలదాచుకున్నారు. ఆమెకు ఆశ్రయం కల్పించాలని ఒడనాడి సంస్థను యువకుని బంధువులు సంప్రదించారు. ఇంతలో హుణసూరులో తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు పెట్టారు. యువతి ఇష్టం మేరకు పోలీసులు ఆమెను ఒడనాడి సంస్థ నుంచి పిలుచుకెళ్లారు.
కానీ ఏం జరిగిందో కానీ.. ఒడనాడి సంస్థకు కాకుండా తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ క్రమంలో ఈ నెల 26న యువతిని ఆమె తండ్రే కొట్టి ఉరివేసి చంపి పరువు హత్యకు పాల్పడినట్లు తెలిసిందని ఒడనాడి సంస్థ కార్యకర్తలు ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment