బాలలు దౌర్జన్యాలను ఎదుర్కోవాలి
కోలారు : పోక్సో చట్టం, బాల కార్మిక చట్టాల గురించి బాలలు తెలుసుకోవాలని తమపై జరుగుతున్న దౌర్జన్యాలను ధైర్యంగా ఎదుర్కోవాలని సీనియర్ సివిల్ న్యాయమూర్తి సునీల్ ఎస్ హొసమని తెలిపారు. శనివారం నగరంలోని పాత్రికేయ భవనంలో నిర్వహించిన టైలరింగ్ శిక్షణా తరగతులు, మహిళా సబలీకరణ, పోక్సో చట్టం తదితర వాటిపై జాగృతి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. నేడు మహిళలు అన్నిరంగాలలో ముందడుగు వేస్తుండడం సంతోషించదగిన విషయమన్నారు. మహిళలు స్వాభిమానంతో జీవనం సాగించాలని ఆలోచిస్తుండడం సంతోషించదగిన విషయమన్నారు. మహిళా హక్కుల కార్యకర్త, గమన మహిళా సంస్థ అధ్యక్షురాలు శాంతమ్మ మాట్లాడుతూ... ఎలాంటి సమస్య ఉన్నా బాలలు, మహిళలు, బాలికలు ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. ఎట్టి పరిస్థితిలోను తమ ముందు జరుగుతున్న తప్పులను చూస్తూ ఊరుకోకూడదన్నారు. ప్రశ్నించే తత్వాన్ని పెంచుకోవాలన్నారు. ప్రతి ఒక్కరు మహిళలు, పిల్లలలో ఆత్మస్థైర్యం నింపే ప్రయత్నం చేయాలన్నారు,
Comments
Please login to add a commentAdd a comment