నక్సలైట్ల కోసం వేట
బనశంకరి: ఉడుపి జిల్లా హెబ్రి అడవిలో యాంటి నక్సల్ బలగాలతో ఎన్‌కౌంటర్‌లో ప్రముఖ నక్సల్ నేత విక్రమ్‌గౌడ మరణించడం నక్సల్ వర్గాల్లో కలవరం కలిగిస్తోంది. ఈ ఎన్‌కౌంటర్ నేపథ్యంలో మళ్లీ నక్సలైట్లు ప్రతీకార దాడులకు పాల్పడతారా? అనే అనుమానం పోలీసుల్లో నెలకొంది. నక్సలైట్లు హతమైనప్పుడు సహచరులు ప్రతీకార దాడులకు పాల్పడడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉడుపి, మంగళూరులో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పెద్దసంఖ్యలో పోలీసులు మోహరించారు. కేరళ సరిహద్దు అడవుల్లో పెద్ద ఎత్తున గాలింపు కొనసాగుతోంది. వందలాదిగా పోలీసులు వాహనాలు, జాగిలాలతో జల్లెడ పడుతున్నారు. నక్సలైట్లు, పోలీసుల మధ్యలో నలిగిపోతున్నామని గ్రామస్తులు బిక్కుబిక్కుమంటున్నారు.
అర్ధరాత్రి పోస్టుమార్టం
విక్రమ్‌గౌడ భౌతిక కాయాన్ని మంగళవారం మణిపాల్ కేఎంసీ మార్చురీకి తరలించారు. అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము 5 గంటల మధ్య డాక్టర్లు పూర్తిచేశారు. ఉదయం విక్రమ్‌గౌడ సోదరుడు సురేశ్‌గౌడ, సోదరి సుగుణ, కుటుంబసభ్యులు వచ్చారు. సోదరున్ని అనాథ శవంగా పడేయబోమని, సొంతూరు కూడ్లువిలో పొలంలో అంత్యక్రియలు నిర్వహిస్తామని సోదరి తెలిపారు. విక్రమ్‌గౌడ చితికి సోదరుడు సురేశ్‌గౌడ నిప్పుంటించారు. గ్రామస్తులు, పోలీసులు హాజరయ్యారు.
లొంగిపోలేదు.. అందుకే: సీఎం
నక్సలైట్ నేత విక్రమ్‌గౌడ అనేక కేసుల్లో మోస్ట్‌వాంటెడ్ గా ఉన్నాడు. నక్సల్స్ కార్యకలాపాలను అణచి వేయడానికి ఈ ఎన్‌కౌంటర్ జరిగింది అని ముఖ్యమంత్రి సిద్దరామయ్య చెప్పారు. బుధవారం నగరంలో విలేకరులతో సీఎం ఈ విషయమై విలేకరులతో మాట్లాడారు. కన్నడనాట నక్సలైట్లలో ముఖ్య నేతగా ఉన్న విక్రమ్‌గౌడ ఎన్‌కౌంటర్ గురించి వామపక్ష నేతలు, మేధావులు అనుమానాలు వ్యక్తం చేయడంపై స్పందిస్తూ విక్రమ్‌గౌడ ఎదురుపడినప్పుడు పోలీసులు లొంగిపోవాలని ఆదేశించగా, అతను లొంగిపోలేదని చెప్పారు. విక్రమ్‌గౌడ ను పట్టుకున్నవారికి కేరళ ప్రభుత్వం రూ.25 లక్షలు, కర్ణాటక ప్రభుత్వం రూ.5 లక్షల బహుమానం ప్రకటించిందని చెప్పారు.
ఉడుపి, మంగళూరు జిల్లాల్లో అలర్ట్
నక్సల్ నేత విక్రమ్‌గౌడ అంత్యక్రియలు
ఎన్‌కౌంటర్‌కు సీఎం సిద్దు సమర్థన
Comments
Please login to add a commentAdd a comment