రూ.25 కోట్ల పార్కింగ్ భవనం.. వృథా
శివమొగ్గ: మల్టీప్లెక్స్ థియేటర్ మాదిరిగా కనిపిస్తున్న ఈ భవనం పార్కింగ్ కోసం కట్టినది. శివమొగ్గ నగర నడిబొడ్డున పూల మార్కెట్ సమీపంలో కోట్లాది రూపాయలను ఖర్చు చేసి నిర్మించిన మల్టీ లెవెల్ పార్కింగ్ భవనం.. ఏడాది గడుస్తున్నా ఇంతవరకు ప్రజలకు అందుబాటులోకి రాలేదు. నగరంలో ఏటేటా వాహనాల సంఖ్య పెరుగుతోంది. దీంతో పార్కింగ్ సమస్య ఏర్పడుతోంది. కొన్ని రోడ్లలో వాహనాల పార్కింగ్ సమస్యతో ప్రజలు, వాహన రాకపోకలు దుర్భరంగా మారాయి. దీంతో స్మార్ట్‌సిటీ పథకం కింద రూ.25 కోట్లతో మూడంతస్తుల అత్యాధునిక వాహనాల పార్కింగ్ భవనాన్ని నిర్మించారు. ఈ భవనంలో ఒకేసారి 172 కార్లు, 78 ద్విచక్రవాహనాలను నిలపవచ్చు. అదే విధంగా సెల్లార్‌లో 118 స్టాళ్లను నిర్మించారు. వీటిలో పూలు, పండ్లు విక్రయించే వ్యాపారులకు అవకాశం కల్పించాలని నిర్ణయించారు. లిఫ్ట్ వ్యవస్థతో పాటు అన్ని హంగులను కల్పించారు. స్టాళ్లకు బాడుగను నిర్ణయించి వ్యాపారులకు పంపిణీ చేయాల్సి ఉంది. వాహనాల పార్కింగ్‌కు టెండర్ పిలిచి అర్హులైన కాంట్రాక్టరుకు అప్పగించాల్సి ఉంది.
పాలికె మొద్దు నిద్ర
అయితే ఇంతవరకు ఆ పనులేవీ కాలేదు. దీంతో ప్రతి నెలా భవనం నుంచి లభించాల్సిన లక్షలాది రూపాయల ఆదాయం అందకుండా పోతోంది. ప్రజల పార్కింగ్ కష్టాలు కూడా తీరడం లేదు. ఈ భవనం మహానగర పాలికె ఆధ్వర్యంలో ఉండడంతో పాలికె అధికారులే పట్టించుకోవాల్సి ఉంది.
ప్రారంభానికి ఆమడ దూరం
శివమొగ్గవాసులకు తప్పని కష్టాలు
Comments
Please login to add a commentAdd a comment