వేశ్యావాటిక నిర్వహిస్తున్నారని దాడి
● కేసు నమోదు
సాక్షి,బళ్లారి: బెళగావి జిల్లా వడ్డరవాడిహళ్లి గ్రామంలో వేశ్యా వాటిక నిర్వహిస్తున్నారని ఇద్దరు మహిళలపై దాడి చేసి, దౌర్జన్యం చేసిన వీడియోలు వైరల్ కావడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు. అయితే వేశ్యావాటిక నిర్వహిస్తుండటంతో చుట్టుపక్కల వాళ్లు ఇబ్బందులు పడుతున్నామన్న దానిపైనే దాడి చేశామని స్థానికులు పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయడానికి వెనుకడుగు వేసినప్పటికి, చివరికి ముగ్గురిపై కేసు నమోదు చేశారు. వడ్డరవాడి ప్రాంతంలో ఓ మహిళతో కొందరు సన్నిహితంగా ఉంటూ అక్కడే నివాసం ఉండేవారని, దీంతో తల్లి, కూతురుపై చట్టుపక్కల వారు ఫిర్యాదు చేయడంతో పాటు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని దాడి చేయడంతో కలకలం రేపింది. సంబంధం లేని వాళ్లు మహిళ ఇంటికి వచ్చి వెళ్తున్నారని, దీంతో కుటుంబాలు నివాసం ఉంటున్న వారు ఎలా జీవనం సాగించాలని ప్రశ్నిస్తున్నారు. పోలీసు కమిషనర్ సూచనల మేరకు కేసు నమోదు చేశారు. తాము వేశ్యావాటిక నిర్వహించడం లేదని, తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని బాధిత మహిళలు పోలీసులు ఎదుట వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment