బెళుగుప్ప: జీడిపల్లికి చెందిన నవ్య(22) అనే యువతి తనకు చదువుకు తగిన ఉద్యోగం రాలేదని తీవ్ర మనస్థాపానికి గురై బుధవారం ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామానికి చెందిన కమ్మ రామాంజినేయులు, కమ్మ నాగమణిల కూతురు నవ్య అనంతపురంలో శ్రీచైతన్య కాలేజ్‌లో డిగ్రీ వరకు చదివి పలు కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ కోర్సులను హైదరాబాద్‌లో పూర్తి చేసింది.
చాలాసార్లు పలు కంపెనీలకు ఇంటర్వ్యూలకు సైతం వెళ్లినా ఉద్యోగం రాలేదు. దీంతో ఇటీవల ఇంటిలోనే ఉన్న నవ్య తీవ్ర మనస్థాపానికి గురై పడకగదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి వెళ్లి పరిశీలించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టామని ఎస్‌ఐ శివ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment