ప్రశాంతంగా పీడీఓ పరీక్షలు
హొసపేటె: పీడీఓ రిక్రూట్‌మెంట్ పరీక్ష శనివారం వివిధ కళాశాలల్లో ప్రశాంతంగా నిర్వహించారు. కన్నడ భాషకు సంబంధించిన పోటీ పరీక్షకు అభ్యర్థుల వివిధ తాలూకా నుంచి వచ్చారు. పీడీఓ నియామక పోటీ పరీక్షకు కన్నడ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్ర 4 గంటల వరకు నిర్వహించారు. హోస్పేట్ 22 కేంద్రాలు, హెచ్‌బీవోహళ్లిలో 2 కేంద్రాలు కలిపి మొత్తం 24 కేంద్రాలను పరీక్షలను నిర్వహించారు. మొత్తం 8,214 మంది అభ్యర్థులు పరీక్షలో పాల్గొన్నారు. తిరిగి ఆదివారం జరిగే పోటీ పరీక్షలో ఉదయం 10 గంటల నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రెండు పేపర్లను రాయనున్నారు.
పకడ్బందీగా నిర్వహిస్తాం
పీడీఓ రిక్రూట్‌మెంట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తామని విజయనగరం కలెక్టర్ ఎంఎస్ దివాకర్ తెలిపారు. శనివారం నగరంలోని కలెక్టరేట్‌లో నిర్వహించిన పీడీఓ నియామక పోటీ పరీక్షల సన్నాహక సమావేశానికి అధ్యక్షత వహించి మాట్లాడారు. హోస్పేట్ 22 కేంద్రాలు, హెచ్‌బీవోహళ్లిలో 2 కేంద్రాలు కలిపి మొత్తం 24 కేంద్రాలను కేటాయించారు. మొత్తం 12,036 మంది అభ్యర్థులు పరీక్షను రాయనున్నారు. ఎలాంటి అవకతవకలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. శనివారం కన్నడ భాష పరీక్ష పూర్తయిందని, 17న మరో పరీక్ష రాయనున్నారని చెప్పారు. ఈ సందర్భంగా అదనపు జిల్లా కలెక్టర్ ఈ.బాలకృష్ణప్ప తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment