బెంగళూరులో వర్షాలు
బొమ్మనహళ్లి, బనశంకరి: బెంగళూరు నగరంలో కాస్త విరామం ఇచ్చిన వానలు బుధవారం మళ్లీ కురిశాయి. రోడ్లు జలమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రాజరాజేశ్వరినగర, కెంగేరి, విజయనగర, బ్యాటరాయనపుర, చంద్రాలేఔట్, జ్ఞాన భారతి, నాగరబావి, మాగడిరోడ్డు, సుమ్మనహళ్లి తో పాటు అనేక ప్రాంతాల్లో వర్షం కురిసింది. అనేక సర్కిళ్లలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గురగుంటెపాళ్య –పీణ్యా రోడ్డు జలమయమైంది. నీళ్లలోనే వాహనాలు సంచరించాయి. సుమనహళ్లి జంక్షన్ జలమయం కావడంతో నిదానంగా ప్రయాణించాలని ట్రాఫిక్ పోలీసులు మనవిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment