టపాసులకు కిటకిట
బొమ్మనహళ్లి: ఐటీ సిటీలో ఎక్కడ చూసినా దీపావళి సందోహం ఆవరించింది. టపాసుల షాపుల్లో జోరుగా కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. దుకాణాల సంఖ్య తగ్గినా, ధరలు పెరిగినా వ్యాపారంలో ఏమీ తేడా లేదు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న బీబీఎంపీ మైదానాల్లో ఏర్పాటు చేసిన టపాసుల దుకాణాలు బుధవారం రాత్రి వరకూ కిటకిటలాడాయి. ముఖ్యంగా యువతి, యువకులు పెద్దసంఖ్యలో వచ్చి ఇష్టమైన టపాసులను కొన్నారు. మల్లేశ్వరంలో ఉన్న బీబీఎంపీ మైదానంలో రద్దీ ఏర్పడింది. స్టాక్ మొత్తం అయిపోయిందని, మళ్లీ కొత్త స్టాక్ కోసం ఆర్డర్ చేసినట్లు కొందరు వ్యాపారులు చెప్పారు. గతేడాది కంటే ఈసారి డిమాండు ఎక్కువగా ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment