5వ చిరుత బందీ
మైసూరు: జిల్లాలోని హెచ్‌డీ కోటె పట్టణంలోని హౌసింగ్ బోర్డు సమీపంలో ఓ రైతు పొలంలో బోనులోకి చిరుత చిక్కింది. ఇలా దొరికిన ఐదవ చిరుత ఇది కావడం గమనార్హం. అన్నీ కూడా మగవే. పట్టణంలోని హౌసింగ్ బోర్డుకు ఆనుకుని ఉన్న రైతులు దశరథ, వివేక్, గురుమల్లు, సణ్ణప్ప, సోమణ్ణ, సణ్ణయ్య తదితరుల పొలాల్లో చిరుతల బెడద అధికమైంది. నిత్యం ఈ ప్రాంతంలో ఆవులు, దూడలు, మేకలు, కుక్కలను చంపి తినేసేవి. దీంతో రైతులు పొలాలకు వెళ్లాలంటే భయపడేవారు. దీంతో అటవీ శాఖ అధికారి పూజా కు రెండు నెలల క్రితం ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి బోనులు ఏర్పాటు చేయగా విడతలవారీగా నాలుగు చిరుతలు బోనులో పడ్డాయి. భారీ సైజులోని చిరుత చిక్కిందని తెలియగానే చూసేందుకు వందలాది మంది తరలి వచ్చారు. అటవీ అధికారులు వెంటనే చిరుతను అక్కడి నుంచి తరలించారు. ఇంకా మరొక తల్లి చిరుత, పిల్ల ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment