పాత భవనాల కూల్చివేతలు
బనశంకరి: నగరంలోని బాబూసాబ్‌పాళ్యలో భారీ కట్టడం నేలకూలి 9 మంది చనిపోయిన దుర్ఘటనతో బీబీఎంపీ మేలుకుంది. పాత, అక్రమ భవనాలపై దృష్టి సారించింది. బుధవారం మహదేవపుర వలయంలో శిథిలావస్థలో ఉన్న కట్టడాలను నేలమట్టం చేశారు. హెచ్‌ఏఎల్ ఉపవిభాగం అన్నసంద్రపాళ్య మొదటి మెయిన్‌రోడ్డులో 707లో సైటులో ఫిరోజ్‌ఖాన్ అనే వ్యక్తి 30 ఇన్‌టు 60 చ. అడుగుల విస్తీర్ణంలో సుమారు 40 ఏళ్లు క్రితం నిర్మించిన గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తు శిథిలావస్థకు చేరుకున్నాయి. నోటీసు ఇచ్చి పాలికె ఇంజనీర్లు జేసీబీ యంత్రాలతో కట్టడాన్ని కూల్చివేశారు. ఇస్లాంపురలో, కగ్గదాసపురలోనూ కూల్చివేతలు జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment