రాజధానిలో డెంగీ బెడద
●నెలలో 930 మందికి జ్వరం
బనశంకరి/ మైసూరు: రాష్ట్రంలో ఎండలు, వర్షాల మధ్య బెంగళూరు నగరవాసులకు డెంగీ భయం నెలకొంది. ఈ విషజ్వరం కేసుల సంఖ్య వెయ్యిని తాకుతోంది. ఏప్రిల్ నుంచి మే 10 వరకు నగర పరిధిలో 930 మంది డెంగీకి గురయ్యారు. ఇప్పటివరకు 1,974 మంది నుంచి రక్త నమూనాలు సేకరించగా అందులో 930 మందికి డెంగీ నిర్ధారణ అయ్యింది. దక్షిణ వలయంలో ఎక్కువమందికి డెంగీ సోకింది. బొమ్మనహళ్లి 20, దాసరహళ్లి 2, ఈస్ట్ 224, మహదేవపుర 97, ఆర్‌ఆర్.నగర 18, బెంగళూరు దక్షిణ 453, వెస్ట్ 99, యలహంకలో 17 డెంగీ కేసులు నమోదయ్యాయి.
కేరళలో వెస్ట్‌నైల్.. మైసూరులో అలర్ట్
మరోవైపు పొరుగు రాష్ట్రం కేరళలో వెస్ట్ నైల్ జ్వరం కనిపించడంతో మైసూరు జిల్లాలో ఆరోగ్య శాఖ హెచ్చరికలు జారీ చేసింది. జిల్లాలోని హెచ్‌డీ కోటె తాలూకాలోని డీబీ కొప్ప తదితర ప్రాంతాలు కేరళను ఆనుకుని ఉండడంతో గట్టి నిఘా ఉంచారు. ఆరోగ్య శాఖ సిబ్బంది ఈ వైరస్‌పై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు,. జ్వరం, నొప్పులతో పాటు దేహంపై దద్దుర్లు కనిపిస్తే అవి వెస్ట్ నైల్ లక్షణాలుగా తెలిపారు. వెంటనే సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స పొందాలని ఆరోగ్య శాఖ తెలిపింది. వెస్ట్ నైల్ ప్రాణాంతకం కాదు. సాధారణ జ్వరానికి ఇచ్చే చికిత్సనే ఇందులోనూ ఇస్తున్నట్లు డీహెచ్‌ఓ పీసీ కుమారస్వామి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment