అమ్మ పాలకూ బ్యాంకు | Sakshi
Sakshi News home page

అమ్మ పాలకూ బ్యాంకు

Published Mon, May 27 2024 5:20 PM

అమ్మ

హుబ్లీ: బిడ్డకు తల్లి పాలను మించిన ఆహారం మరొకటి ఉండదు, తల్లిపాలు ఆహారమే కాదు ఔషధం కూడా. బిడ్డలో వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది. అంత గొప్ప విశిష్టత కలిగిన తల్లి పాలకు కొందరు దూరమవల్సి వస్తోంది. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించేందుకు హుబ్లీలోని కిమ్స్‌ ఆస్పత్రిలో తల్లి పాల బ్యాంకు ఏర్పాటైంది. రక్తదానం మాదిరిగా అమ్మ పాలను దానంగా స్వీకరించి నిల్వ చేసేందుకు కిమ్స్‌లో మిల్స్‌ బ్యాంకు సిద్ధమైంది. 15 రోజుల క్రితం కిమ్స్‌లో ప్రారంభించిన జీవాంమృత హుమన్‌ మిల్క్‌ బ్యాంకుకు మాతృమూర్తుల నుంచి మంచి స్పందని లభిస్తోంది. కేవలం రెండు వారాలలోనే 60కు పైగా తల్లులు పాలు ఇచ్చారు. సుమారు 3500 ఎంఎల్‌ పాలు సేకరణ అయింది. ఆ పాలును వంద మంది పిసిపాపలకు అందించారు.

కిమ్స్‌లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం :

కిమ్స్‌లో ఏర్పాటు చేసిన హుమన్‌ మిల్క్‌ బ్యాంక్‌ కోసం సంస్థ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నారు. ఇందుకోసం నిపుణులైన వైద్య సిబ్బంది ఉన్నారు. సేకరించిన తల్లి పాలను గది ఉష్ణోగ్రత, లేక రెఫ్రిజరేటర్‌లో 4.8 డిగ్రీల మధ్య 24 గంటల పాటు నిల్వ చేస్తారు. మైనస్‌ 20 డిగ్రీల సెల్సియస్‌లో సంస్కరించినప్పుడు మూడు నెలల వరకు నాణ్యతతో ఉంటాయి. దాత ఇచ్చిన పాలను తేదీ, సమయం నమోదు చేసి వాటిని 24 గంటల లోపు డీప్‌ ఫ్రిజర్‌ విభాగంలో నిల్వ చేస్తామని సదరు విభాగం నిర్వాహకురాలు సుజాత తెలిపారు. బిడ్డ పుట్టిన ఆరు నెలల ఆరోగ్యవంతమైన బాలింత దానం ఇచ్చే పాలను కొన్ని పరీక్షలు జరిపి అనంతరం నిలువ చేస్తారు. ఎక్కువ పాలు కలిగిన తల్లులు ఇక్కడికి వచ్చి దానం చేస్తారు. ఈ మహా కార్యానికి మూలమైన తల్లులకు కిమ్స్‌ శిశు విభాగం ముఖ్య అధికారి వినోద్‌ రటగేరి కృతజ్ఞతలు తెలిపారు.

కిమ్స్‌లో మదర్‌ మిల్క్‌ బ్యాంకు

రెండు వారాల్లోని 3500 ఎంఎల్‌ పాలు సేకరణ

చనుబాలకు దూరమయ్యే బిడ్డలకు సాంత్వన

అమ్మ పాలకూ బ్యాంకు
1/1

అమ్మ పాలకూ బ్యాంకు

Advertisement
 
Advertisement
 
Advertisement