మహా గణపతిం భజే | - | Sakshi
Sakshi News home page

మహా గణపతిం భజే

Published Mon, Sep 9 2024 1:18 AM | Last Updated on Mon, Sep 9 2024 1:18 AM

మహా గ

సాక్షి,బళ్లారి: వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని అన్ని ప్రాంతాల్లో వేడుకలు వైభవంగా నిర్వహించారు. విభిన్న రూపాల్లో వినాయకుడి విగ్రహాలు కొలువుదీరాయి. భక్తులు గణపయ్యలకు అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. బళ్లారి నగరంలో వాడవాడలా వినాయక విగ్రహాలు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా అనంతపురం రోడ్డు ఎంజీ సర్కిల్‌ వద్ద సర్వసిద్ది వినాయక మిత్ర మండలి ఆధ్వర్యంలో అయోధ్య భవ్య మందిరం తరహాలో బాల రాముడి రూపంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం నగర వాసులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అయోధ్య భవ్య మందిరం తరహాలోనే వినాయక మంటపం ఏర్పాటు చేసి, విద్యుత్‌ దీపాలు అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వినాయకుడిని దర్శించుకుంటున్నారు. చవితి నుంచి ఐదు రోజుల పాటు వినాయకుడిని దర్శించుకోవచ్చని, అనంతరం ఐదో రోజు నిమజ్జనం ఉంటుందని సర్వసిద్ధి వినాయక మిత్ర మండలి సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా వినాయకుడిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌ రెడ్డిని మండలి సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో సర్వసిద్ది వినాయక మిత్ర మండలి మాజీ బుడా అధ్యక్షుడు మారుతీ ప్రసాద్‌, బీఆర్‌ఆర్‌ సునీల్‌, రాఘవ, నాగరాజు, జితేంద్ర, పల్లం కిశోర్‌, గోపాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రాయచూరులో..:

రాయచూరు రూరల్‌: నగరంలో వినాయక చవితిని ఘనంగా నిర్వహించారు. శనివారం ఉదయం నుంచే సందడి నెలకొంది. తీన్‌ కందిల్‌లో పంచముఖి గణపతి, సూపర్‌ మార్కెట్‌ వద్ద మహారాజ గణపతి, మడివాళ నగరలో లంబోదరుడు, గీతా మందిర్‌ శ్రీకృష్ణ విఘ్నేశ్వరుడు, భవసార వీధిలో అశ్వవాహనంలో గణనాథుడు, భంగికుంటలో ఉగ్ర నరసింహ రూపంలో వినాయకుడు, హరిహర రోడ్డులో విష్టు అవతారంలో, బావి సర్కిల్‌లో రుషి రూపంలో, వేంకటేశ్వర రూపంలో వినాయకులను కొలువుదీర్చారు. కిల్లేమఠం, సూపర్‌ మార్కెట్‌ వద్ద గణనాథులకు శాంతమల్ల శివాచార్య ప్రత్యేక పూజలు జరిపారు.

కోలారులో..

కోలారు: కోలారు నగరంలో వినాయక విగ్రహాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వాడవాడలా వినాయక విగ్రహాలు ప్రతిష్టించారు. పెద్ద సంఖ్యలో భక్తులు వినాయకులను దర్శించుకున్నారు. నగరంలోని గాంధీవనం కురుపేటలో ప్రతిష్టించిన బృహత్‌ వినాయక విగ్రహాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అదేవిధంగా నగరంలోని కోట ప్రాంతంలోని వినాయక దేవాలయంలో వినాయకుడికి 10,001 కుడుములతో అలంకరణ చేసి ప్రత్యేకంగా పూజలు చేశారు. అదేవిధంగా నగరంలోని గౌరి పేటలో ప్రతిష్టించిన వినాయక విగ్రహం కూడా చూడముచ్చటగా ఉంది.

కొలువుదీరిన విభిన్న గణపతులు

బళ్లారి రూరల్‌ : నగరంలో విభిన్నంగా గణపతి ప్రతిమలు కొలువుదీరాయి. ఏకదంతుడుకి భక్తి శ్రద్దలతో పూజలు చేశారు. కౌల్‌బజార్‌లోని వినాయకగుడి ప్రాంగణంలో శివలింగం రూపంలో ప్రతిష్టించి పూజలు చేశారు. బీఎంసీఆర్‌సీలో అశ్వాలపై స్వారీ చేసే గౌరీ తనయుడుగా ప్రతిష్టించారు. మార్వాడి గణేశగుడిలో గధాదారియై నక్షత్ర మండలంలో సంచరించే వినాయడిగా కనిపించారు. రామ్‌నగర్‌లో విఘ్నేశ్వరుడు ఆంజనేయుడి భుజానమోస్తున్నట్లుగా ప్రతిష్టించారు. మోదీ వీధిలో మయూర గణపతి, బండిహట్టిలో కేదారీనాథ్‌లో తాండవ గణపతిగా, కౌల్‌బజార్‌లో జ్యోతిర్లింగాల మధ్య శివలింగానికి అభిషేకించే మూషిక వాహనుడిగా ప్రతిష్టించి పూజలు నిర్వహించారు.

మాలూరులో..

మాలూరు : పట్టణంతో పాటు తాలూకా వ్యాప్తంగా గౌరి వినాయక పండుగను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అన్ని వార్డులతో పాటు తాలూకాలోని ప్రతి గ్రామంలోను వినాయక విగ్రహాలను ప్రతిష్టించి పూజలు చేశారు. వివిధ రూపాల్లో కొలువుదీర్చారు. లక్కూరు గ్రామంలో శ్రీ యోగివేమన సంఘం ఆధ్వర్యంలో వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి ఘనంగా పూజలు చేశారు.

కోలారులో...

కోలారు : నగరంలో పలుచోట్ల వివిధ రూపాల్లో గణనాథులను ప్రతిష్టించారు. గాంధీవనం వద్ద భజరంగదళ, తిలక్‌ వినాయక విసర్జన సమితి ఆధ్వర్యంలో ప్రతిష్టించిన బృహత్‌ వినాయక విగ్రహాలు నగర ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అదేవిధంగా నగరంలోని ఎస్‌ఎన్‌ఆర్‌ ఆస్పత్రి సర్కిల్‌ అఖండ భారత వినాయక సభ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన వినాయక విగ్రహం అబ్బుర పరుస్తోంది. తాలూకాలోని వక్కలేరి గ్రామంలో వినాయక సేవా మండలి ఆధ్వర్యంలో గరుడ వాహనంపై ప్రతిష్టించిన వినాయకుడికి విశేష పూజలు నిర్వహించారు.

వాడవాడలా వివిధ రూపాల్లో

కొలువుదీరిన గణపయ్యలు

నిత్యం కొనసాగుతున్న పూజలు

బళ్లారిలో ఆకట్టుకుంటున్న

ఆయోధ్య బాలరామ వినాయకుడు

No comments yet. Be the first to comment!
Add a comment
మహా గణపతిం భజే 1
1/8

మహా గణపతిం భజే

మహా గణపతిం భజే 2
2/8

మహా గణపతిం భజే

మహా గణపతిం భజే 3
3/8

మహా గణపతిం భజే

మహా గణపతిం భజే 4
4/8

మహా గణపతిం భజే

మహా గణపతిం భజే 5
5/8

మహా గణపతిం భజే

మహా గణపతిం భజే 6
6/8

మహా గణపతిం భజే

మహా గణపతిం భజే 7
7/8

మహా గణపతిం భజే

మహా గణపతిం భజే 8
8/8

మహా గణపతిం భజే

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement