వినాయకుడికి కలెక్టర్‌ విశేష పూజలు | - | Sakshi
Sakshi News home page

వినాయకుడికి కలెక్టర్‌ విశేష పూజలు

Published Mon, Sep 9 2024 1:18 AM | Last Updated on Mon, Sep 9 2024 1:18 AM

వినాయకుడికి                            కలెక్టర్‌ విశేష

రాయచూరు రూరల్‌: బెళగావి నగరంలో వివిధ రూపాల్లో వినాయకులను ప్రతిష్టించారు. జిల్లాధికారి మహ్మద్‌ రోషన్‌ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి నగరంలో చెన్నమ్మ సర్కిల్లో ఏర్పాటు చేసిన గణపతికి విశేష పూజలు చేశారు. అనంతరంబె బెళగావి విశ్వేశ్వరయ్య కాలనీలో జిల్లాధికారి నివాసంలో వినాయకుడిని ప్రతిష్టించి మత సామరస్యాన్ని చాటారు.

హుబ్లీలో భారీ బందోబస్తు

హుబ్లీ: జంట నగరాల్లో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వినాయక ఉత్సవాలతో పాటు ఈద్‌ మిలాద్‌ పండుగ ఉండటంతో నగరంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 2 వేలకు పైగా పోలీసులు బందోబస్తులో ఉన్నారు. ముఖ్యంగా ఈద్గా మైదానంలో మూడు రోజుల పాటు నిర్వహించే వినాయక ఉత్సవాలకు మాత్రం మరింత భద్రత కల్పించారు.

కెనాల్‌లో పడిపోయిన యువకుడు

రక్షించిన స్థానికులు

హొసపేటె: తాలూకాలోని కమలాపూర్‌ ఎల్‌ఎల్‌సీ కెనాల్‌లో ప్రమాదశాత్తు పడిపోయిన యువకుడిని స్థానికులు కాపాడిన ఘటన ఆదివారం జరిగింది. తమిళనాడుకు చెందిన ఓ యువకుడు కుటుంబ సభ్యులతో కలిసి కమలాపురం ఆలయానికి వచ్చారు. స్నానం చేయడానికి కెనాల్లోకి దిగాడు. నీటి ఉధృతికి కొట్టుకుపోయాడు. వెంటనే గమనించిన స్థానికులు నీటిలో దూకి యువకుడిని రక్షించారు.

అశ్లీల వీడియోలతో

బ్లాక్‌మెయిల్‌

హుబ్లీ: ముంబై క్రైం బ్రాంచ్‌ విభాగం నుంచి ఫోన్‌ చేస్తున్నామంటూ వీడియో కాల్‌ చేసి మహిళను బెదిరించి నగ్నంగా మార్చి రికార్డు చేసి బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్న ఉదంతం బెళగావిలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై బెళగావి సైబర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వివరాలు... దుండగులు ఓ మహిళకు వీడియో కాల్‌ చేసి నీవు ఒక నేరంలో పాలుపంచుకున్నావని బెదిరించి వివస్త్రగా మార్చి అనంతరం డబ్బులు డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో ఆ స్టేషన్‌ పరిధిలో మూడు కేసు నమోదయ్యాయి. ఈ కేసులపై నగర సీపీ మిర్టిన్‌ మాట్లాడుతూ... సైబర్‌ నేరగాళ్లు అమాయకులను పలు రకాలుగా బెదిరింపులు చేస్తున్నారని, ప్రజలు భయపడకుండా పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement