20న గర్భ సంస్కారంపై అవగాహన | - | Sakshi
Sakshi News home page

20న గర్భ సంస్కారంపై అవగాహన

Published Wed, Oct 16 2024 1:28 AM | Last Updated on Wed, Oct 16 2024 1:28 AM

-

హుబ్లీ: ధార్వాడలోని దక్షిణ భారత హిందీ ప్రచార సభ సభాభవనంలో ఈనెల 20న ఉదయం రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో గర్భ సంస్కారంపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు క్లబ్‌ అధ్యక్షుడు లక్ష్మీకాంత నాయక తెలిపారు. ఆయన స్థానిక మీడియాతో మాట్లాడుతూ హం ఫౌండేషన్‌, దక్షిణ భారత హిందీ ప్రచార సభ, సీబీ కుత్తల ఆయుర్వేదిక్‌ మెడికల్‌ కళాశాల, డాక్టర్‌ బిడి జత్తి హోమియోపతిక్‌ వైద్య కళాశాల సహకారంతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. జన్మించే శిశువుల మానసిక, శారీరక, ఉద్వేగపూర్తి ఎదుగుదల ప్రాధాన్యతపై పూర్తిగా వివరాలు తెలియజేయడమే ఈ గర్భ సంస్కారం అవగాహన కార్యక్రమం ఉద్దేశం అన్నారు. ఈ కార్యక్రమం పూర్తిగా ఉచితం అని, భార్యాభర్తలు పాల్గొని కార్యక్రమ ప్రయోజనం పొందాలన్నారు. డాక్టర్‌ సునీత్‌ మాట్లాడుతూ రుతుస్రావంతో శరీర రచన శాస్త్రం, సాంప్రదాయ ఆచరణ, శాసీ్త్రయ నేపథ్యం, వివాహం, గర్భదానం, బీజసంస్కారం, గర్భిణి పరిచర్య, గర్భిణి ఆహార పద్ధతి, పాటించాల్సిన నియమాలు, గర్భిణి ప్రతి దశలో చేయాల్సిన యోగాభ్యాసాలు, శ్రావణం చేయాల్సిన సంగీతం, గర్భస్త శిశువుతో మాట్లాడే రీతి, మంచి విషయాల చింతన, సులభ ప్రసవానికి ముందు, ప్రసవ సమయం, ప్రసవం తర్వాత పాటించాల్సిన నియమాలు, బిడ్డ పుట్టాక చేయాల్సిన సంస్కారాల గురించి అవగాహన కల్పిస్తామన్నారు. ఈ సందర్భంగా జగదీశ్‌ మల్లిగి, అశోక్‌ నాగసముద్ర, డాక్టర్‌ సుజాత, శ్రీకాంత దొడ్డమని పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement