వణికిస్తున్న వర్షాలు | - | Sakshi
Sakshi News home page

వణికిస్తున్న వర్షాలు

Published Wed, Oct 16 2024 1:32 AM | Last Updated on Wed, Oct 16 2024 1:32 AM

వణికి

బనశంకరి/దొడ్డబళ్లాపురం/కృష్ణరాజపురం/శివమొగ్గ: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. బెంగళూరు, తుమకూరు, మైసూరు, బెంగళూరు గ్రామాంతర, మడికేరి, శివమొగ్గ, చిక్‌మగళూరు, దక్షిణ కన్నడ, బెళగావితో పాటు 12 జిల్లాల్లో ఎల్లో అలర్ట్‌ ప్రకటించారు. దక్షిణ ఒళనాడులో ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించారు. మంగళవారం నుంచి మూడురోజులపాటు భారీవర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. శివమొగ్గ, చిక్‌మగళూరు, హాసన, కొడగు, మైసూరు, కోలారు, మండ్య, చిత్రదుర్గ, దావణగెరె, బెంగళూరుగ్రామాంతర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. తుమకూరు జిల్లా మధుగిరి, కొరటగెరె తాలూకాల్లో జయమంగళ నది పొంగి ప్రవహిస్తోంది. ఇప్పటికే నదీ తీరంలోని లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
వణికిస్తున్న వర్షాలు 1
1/3

వణికిస్తున్న వర్షాలు

వణికిస్తున్న వర్షాలు 2
2/3

వణికిస్తున్న వర్షాలు

వణికిస్తున్న వర్షాలు 3
3/3

వణికిస్తున్న వర్షాలు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement