చెరువులోకి దూకి తల్లీకొడుకు ఆత్మహత్య
మైసూరు: చిన్న చిన్న కారణాలతో సామూహిక ఆత్మహత్యలు రాష్ట్రంలో పెరిగిపోతున్నాయి. నిత్యం ఏదో ఒక చోట ఇద్దరు ముగ్గురు బలవన్మరణాలకు పాల్పడడం జరుగుతోంది. ఇదే రీతిలో ఓ మహిళ చిన్నారి కొడుకును తీసుకుని చెరువులోకి దూకి చనిపోయిన ఘటన చామరాజనగర తాలూకాలోని మేలూరుకెరెలో జరిగింది. హోన్నాహళ్లి గ్రామానికి చెందిన మంజు భార్య శివమ్మ (35), కొడుకు హరీష్ (5)తో కలిసి చెరువులో పడి ఆత్మహత్య చేసుకుంది. భార్యభర్తలు ఇద్దరు గార పని చేసుకుని జీవించేవారు. వీరికి 5, 9 ఏళ్ల ఇద్దరు కుమారులున్నారు. ఇటీవల భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. రెండురోజుల కిందట కొడుకును తీసుకుని ఆమె వెళ్లిపోయింది. పనికి వెళ్లి ఉంటాది అని భర్త అనుకున్నాడు. చెరువులో ఆదివారం తల్లీకొడుకు మృతదేహాలు తేలడంతో గ్రామస్తులు, పోలీసులు చేరుకుని బయటకు తీశారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
బిడ్డతో కలిసి నదిలోకి దూకే యత్నం
బనశంకరి: పసికందుతో కలిసి నదిలోకి దూకి ఆత్మహత్యకు యత్నించాడో తండ్రి. ఈ ఘటన దక్షిణ కన్నడ జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. మంగళూరు శివారులోని గురుపురలో సందీప్ అనే వ్యక్తి రెండున్నరేళ్లు పసికందుతో దగ్గరిలోని ఫల్గుణి నది వంతెన మీదకు వచ్చాడు. నదిలోకి దూకుతానని వంతెన అడ్డుగోడ మీదకు ఎక్కాడు. కొందరు కేకలు వేయడంతో ఎవరూ దగ్గరకు రావద్దని బెదిరించాడు. ఇంతలో ఓ బైకిస్టు చూసి అతన్ని వారించాడు. మాటల్లో పెట్టి ఇద్దరినీ ఇవతలికి లాగేశాడు. ఇంతలో జనం వచ్చి సందీప్‌ని పట్టుకున్నారు. ఇలాంటి పని చేయరాదని సందీప్‌కు బుద్ధిమాటలు చెప్పి పంపించారు. దీంతో సుమారు గంట పాటు అక్కడ కోలాహలం నెలకొంది. కుటుంబ సమస్యలే కారణమని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment