మహా నందీశ కనువిందు
మైసూరు: మైసూరు నగరంలోని చాముండి కొండపైన ఉన్న చారిత్రక మహా నంది విగ్రహానికి కార్తీక మాసం సందర్భంగా ఆదివారం మహాభిషేకం నిర్వహించారు. బెట్టద బళగ చారిటబుల్ ట్రస్టు సభ్యుల ఆధ్వర్యంలో ఉదయం 8.30 గంటలకు శివరాత్రి దేశికేంద్ర స్వామి, సోమేశ్వరనాథ స్వామి, చిదానందస్వామి పూజలు చేసి మహాభిషేకానికి నాంది పలికారు. వేద మంత్రాల మధ్య పాలు, పెరుగు, నెయ్యి, కొబ్బరి నీళ్ళు, చెరుకు పాలు, నిమ్మకాయ నీళ్ళు, నూనె, అరటి పండ్లు, ద్రాక్ష, బెల్లం, ఖర్జూరం, గోధుమపిండి, బియ్యం పిండి, పెసర పిండి, బిల్వ పత్రాలు, పూలు మొదలైన సుమారు 32 రకాల పరిమళ ద్రవ్యాలతో నందీశ్వరునికి అభిషేకం చేశారు. పంచామృతాలతో, శాల్యాన్న, రుద్రాభిషేకాలు గావించారు. ద్రవ్యాలను బట్టి మహా నంది విగ్రహం పసుపు, ఎరుపు, తెలుపు తదితర రంగుల్లో దర్శనమిస్తుంటే భక్తులు తన్మయులయ్యారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.
వైభవంగా కార్తీక మాస మహాభిషేకం
Comments
Please login to add a commentAdd a comment