నటుడు డాలి, ధన్యత నిశ్చితార్థం
దొడ్డబళ్లాపురం: కన్నడ హీరో కం విలన్ డాలి ధనంజయ్, స్నేహితురాలు డాక్టర్ ధన్యత నిశ్చితార్థం ఆదివారంనాడు హాసన్ జిల్లా అరసీకెరెలో నిరాడంబరంగా జరిగింది. అరసీకెరె తాలూకా కాళేనహళ్లిలోని ధనంజయ్ స్వగృహంలో ఈ వేడుక జరిగింది. ఆయన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఫిబ్రవరి 16న మైసూరులో వివాహం జరగనుంది.
పొలంపై వక్ఫ్ బోర్డు తగాదా
● రైతుకు బీజేపీ నేతల మద్దతు
చింతామణి: పట్టణంలో 31వ వార్డు తిమ్మసంద్ర శివార్లలోని సర్వే నంబరు 13–20లో ఉన్న భూమి గురించి రైతు– వక్ఫ్ బోర్డు మధ్య తగాదా జరుగుతోంది. రైతుకు మద్దతుగా బీజేపీ నేతలు, మాజీ ఎంపీ మునిస్వామి వచ్చారు. కన్నంపల్లి దగ్గర రైతులతో మునిస్వామి సమావేశమై భూమి పరిశీలనకు వచ్చారు. పోలీసులు, ఎస్పీ కుశాల్ చౌక్సి చేరుకుని అక్కడికి వెళ్లరాదని వారికి సూచించారు. దీంతో పోలీసులు, మునిస్వామి మధ్య వాదోపవాదనలు జరగడంతో ఉద్రిక్తత నెలకొంది. మునిస్వామి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలోని అధికారులు వక్ప్ బోర్డుకు వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. చివరకు 10 మందికి మాత్రమే అనుమతిస్తామనడంతో ఆ మేరకు పొలానికి వెళ్లారు. గొడవలు జరగకుండా పట్టణంలో గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు. ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పొలం వక్ఫ్ బోర్డుదని చెబుతున్నారని రైతు వాపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment