జై శ్రీకంఠేశ్వర
● వేడుకగా చిన్న జాతర తేరు వేడుక
మైసూరు: దక్షిణ కాశీగా ప్రఖ్యాతి చెందిన మైసూరు జిల్లాలోని నంజనగూడులో వెలసిన శ్రీకంఠేశ్వర స్వామివారి చిన్న జాతర మహోత్సవం ఆదివారం కనులపండువగా జరిగింది. పలు జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. తెల్లవారు జామునే 4 గంటల నుంచి దేవాలయంలో పార్వతి సమేత శ్రీకంఠేశ్వర స్వామివారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. ప్రధాన అర్చకులు నాగచంద్ర దీక్షిత్ నిత్యోత్సవం, సంగమ కాల పూజ, మధ్యాహ్న కాళ పూజ నిర్వహించారు. మహా మంగళహారతి ఇచ్చి ఉత్సవమూర్తిని తేరులో ఉంచి జై శ్రీకంఠేశ్వర అని ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment