విజ్ఞాన విపంచి
● ముగిసిన వ్యవసాయ మేళా
శివాజీనగర: ఉద్యాన నగరిలో జీకేవీకేలో మూడు రోజుల నుంచి జరిగిన వ్యవసాయ మేళా ఆదివారం ముగిసింది. తండోపతండాలుగా జన సాగరం వచ్చింది. గత మూడు రోజుల్లో సుమారు 11.5 లక్షల మంది రైతులు, ప్రజలు భేటీ చేయగా, సుమారు రూ. 9 కోట్లకు పైగా వ్యాపారాలు జరిగినట్లు నిర్వాహకులు తెలిపారు. మేలుజాతి విత్తనాలు, వ్యవసాయ పరికరాలు, ఎరువులు, అలంకారిక మొక్కలు, కోళ్లు, పశువుల స్టాళ్లు వెలిశాయి. నిత్యం వేలాది మంది సందర్శించి వస్తు పరికరాలను కొనుగోలు చేశారు. చివరిరోజు సుమారు 5–6 లక్షల మంది భేటీ చేశారు. ఈ సందర్భంగా 250కి పైగా ఉత్తమ రైతులను సన్మానించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాలినీ రజనీష్ సందర్శించారు. ట్రాక్టర్ స్ప్రేయర్‌ను ఆమె స్వయంగా నడపడంతో అందరూ ఆశ్చర్యపోయారు.
Comments
Please login to add a commentAdd a comment