తాత, తండ్రికి ఎదురుదెబ్బ
● ఈసారైనా తనయుడు నిఖిల్‌ని గెలిపించాలని తండ్రి, కేంద్రమంత్రి హెచ్డీ కుమారస్వామి, తాత, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ ఎంతగానో శ్రమించారు. చెన్నపట్టణలో ఊరూరా తిరిగి ప్రచారం సాగించారు. కానీ ఓటర్లు మాత్రం కరుణించలేదు. బీజేపీ టికెట్ దక్కకపోవడంతో ఆఖరిలో కాంగ్రెస్ టికెట్‌తో పోటీ చేసిన సీపీ యోగీశ్వర్కు అదృష్టం వరించింది.
● అలాగే శిగ్గావిలో తమ కుమారున్ని అసెంబ్లీకి పంపాలన్న బసవరాజ బొమ్మైకి తీవ్ర నిరాశ ఎదురైంది. నియోజకవర్గంలో ఓటర్ల లెక్కలు జూనియర్ బొమ్మైకి కలిసిరాలేదు. సంప్రదాయ వర్గాల ఓట్లతో పాటు మైనారిటీల ఓట్లన్నీ కాంగ్రెస్ అభ్యర్థికే పడినట్లు అంచనా.
● సండూరులో అందరూ ఊహించినట్లుగా కాంగ్రెస్ అభ్యర్థిని అన్నపూర్ణ గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి బంగారు హనుమంతును గెలిపించాలని జిల్లాతో పాటు రాష్ట్ర నేతలు కంకణం కట్టుకున్నా ప్రయోజనం లేకపోయింది.
Comments
Please login to add a commentAdd a comment