● కడుపులో 50 టూత్‌బ్రష్‌లు
బనశంకరి: కడుపు నొప్పితో భాదపడతున్న యువకుని పొట్టలో నుంచి 40–50 టూత్ బ్రష్‌లను వైద్యులు బయటకు తీశారు. బెంగళూరు సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రిలో కడుపునొప్పి అంటూ 4 రోజులక్రితం మణికంఠ (26) అనే యువకుడు చేరాడు. డాక్టర్లు కడుపులో ఎంఆర్ఐ స్కానింగ్ చేయగా పెద్దసంఖ్యలో టూత్‌బ్రష్‌లు ఉండడాన్ని గమనించారు. దీంతో ఆపరేషన్ చేయగా పెద్ద చెత్తకుప్ప వంటిది బయటపడింది. 50 వరకూ టూత్‌బ్రష్‌లు, మూడు నాలుగు చాక్లెట్ పేపర్లు లభించాయి. ఇతడు మద్యానికి బానిస కావడంతో పాటు మానసికఅస్వస్థతకు గురై టూత్‌బ్రష్‌లను మింగేసేవాడని డాక్టర్లు అనుమానం వ్యక్తంచేశారు. ఇతన్ని కుటుంబ సభ్యులు గతంలో మద్యం వ్యసన విముక్తి కేంద్రానికి తరలించారు. అప్పటినుంచి బ్రష్‌లను మింగే అలవాటు ఏర్పడిందని తెలిపారు. ప్రస్తుతం కోలుకుంటున్నాడని వైద్యులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment