రూ. కోట్లు వ్యయం.. వినియోగంలో విఫలం
శివమొగ్గ: శివమొగ్గ నగర నడిబొడ్డున అమీర్ అహ్మద్ సర్కిల్(ఏఏ సర్కిల్), శివప్ప నాయక సర్కిళ్లలో కోట్లాది రూపాయలను వెచ్చించి నిర్మించిన అండర్‌పాస్ పాడుబడింది. అండర్‌పాస్‌లో భారీగా నీరు నిలవడమేగాకుండా చెత్తచెదారంతో నిండింది. ఇక్కడ ఒక అండర్‌పాస్ ఉందనే విషయాన్నే పాలికె పాలక మండలి మరిచిపోయినట్లుంది. దీంతో ప్రజల వినియోగానికి వీలు లేకుండా పోయింది. గాంధీబజార్, బీహెచ్ రోడ్డు, నెహ్రూ రోడ్డు, ఎన్‌టీ రోడ్డు, పూల మార్కెట్‌తో సహా చుట్టుపక్కల రోడ్లకు రాకపోకలు సాగించే పాదచారులకు అనుకూలంగా 2008లో ఈ అండర్‌పాస్ నిర్మించారు. దీని గుండా సంచరించేందుకు పాదచారులు ఆసక్తి చూపలేదు. కాలక్రమేణ అండర్ పాస్ అనైతిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. దీంతో అండర్‌పాస్ తలుపులను మూసేశారు. మరొక వైపు అండర్‌పాస్‌లో ఫుట్‌పాత్ వ్యాపారులకు అవకాశం కల్పించాలని నిర్ణయించారు. అది కూడా కార్యరూపంలోకి రాలేదు. ఇటీవల అండర్‌పాస్‌లో నీరు నిండటం మొదలైంది. అండర్‌పాస్ నుంచి నీరు సహజంగా బయటకు వెళ్లేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. తరచుగా పంప్‌సెట్ ఉపయోగించి అండర్‌పాస్‌లోకి చేరిన నీటిని తోడేసేవారు. కొన్నేళ్లుగా ఆ పని కూడా చేయడం లేదు. ప్రస్తుతం అండర్‌పాస్‌లో భారీగా నీరు చేరి కాలువను తలపిస్తోంది.
వృథాగా అండర్‌పాస్
Comments
Please login to add a commentAdd a comment