శివాజీనగర: అనుమానితునిగా అరెస్ట్ చేసిన వ్యక్తి లాకప్ డెత్ అయిన కేసులో నలుగురు పోలీసు సిబ్బందికి ఏడేళ్లు జైలు శిక్ష విధిస్తూ బెంగళూరు సీఐడీ ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చింది.
కేసు నేపథ్యం..
జీవన బీమా నగరలో చోరీ కేసులో మహేంద్ర రాథోడ్ అనే ఒడిశా వ్యక్తిని 2016 మార్చి 19న పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. హెచ్‌ఏఎల్‌లో ఓ ఇంటిలో పని చేస్తున్న మహేంద్ర రాథోడ్, ఆ ఇంటిలో రూ. 3.2 లక్షలు చోరీ చేశాడనేది ఆరోపణ. స్టేషన్‌లో ఆ రోజు సాయంత్రం ఎద నొప్పి అంటూ అతడు చనిపోయాడని పోలీసులు చెబుతున్నారు. కానీ పోలీసులు కొట్టడం, నిర్లక్ష్యం వల్లనే మరణించాడని సీఐడీ తనిఖీలో నిర్ధారణ అయింది. హెడ్ కానిస్టేబుల్ ఎజాజ్ ఖాన్, కానిస్టేబుళ్లు కేశవ మూర్తి, మోహన్‌రామ్, సిద్దప్ప బొమ్మనళ్లి పై కేసు నమోదు చేశారు. వీరిపై 2019లో సీఐడీ అధికారులు కోర్టులో చార్జ్‌షీట్ ని సమర్పించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా కృష్ణవేణి వాదన వినిపించారు. నేరం రుజువు కావడంతో నలుగురికీ ఏడేళ్లు జైలు శిక్ష, రూ. 25 వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు వచ్చింది.
లాకప్ డెత్ కేసులో కోర్టు తీర్పు
Comments
Please login to add a commentAdd a comment