దొడ్డబళ్లాపురం: దుకాణాలే టార్గెట్‌గా చోరీలకు పాల్పడుతున్న 8మంది సభ్యులు గల గ్యాంగ్‌ను బెంగళూరు బయ్యపనహళ్లి పోలీసులు అరెస్టు చేసారు. బిహార్‌కు చెందిన ఇంతియాజ్ ఆలం, జావేద్ ఆలం, పవన్ షా, మునీల్ కుమార్, రిజ్వాన్ దేవన్, సలీం ఆలం, రామేశ్వర గిరి, సూరజ్ కుమార్ అరైస్టెన నిందితులు. పగటి పూట మామూలుగా కూలీ పనులు చేసేవారు. అర్ధరాత్రి నుంచి ముఖ్యంగా మొబైల్ఫోన్ల దుకాణాలను టార్గెట్‌గా చేసుకుని చోరీలు చేసేవారు. సీసీ కెమెరాలకు బెడ్షీట్లు అడ్డుగా పెట్టి, తరువాత షట్టర్లను గడారుతో పైకెత్తి చొరబడేవారు. ఖరీదైన మొబైళ్లు, వస్తువులను చోరీ చేసి మళ్లీ బెడ్షీట్లను అడ్డుగా పెట్టి తప్పించుకునేవారు. చోరీ చేసిన మొబైళ్లను నేపాల్‌లో విక్రయించేవారు. ఉత్తర కన్నడ, ఉడుపి, బెంగళూరు తదితర ప్రాంతాల్లో చోరీలు చేశారు. నిందితుడు ఒకరు చోరీ మొబైల్‌ను బిహార్‌లో ఉపయోగించడంతో పట్టుకున్నారు. మిగతా నిందితులను బెంగళూరు బొమ్మనహళ్లిలో అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment