కలెక్టరేట్లో మంచినీరు లేదు!
శివమొగ్గ: జిల్లాలో పాలనా కేంద్రమైన జిల్లాధికారి కార్యాలయ ఆవరణలో మంచినీరు దొరకడం లేదు. కార్యాలయ ఆవరణలోని రక్షిత మంచినీటి కేంద్రం గత కొన్ని రోజులుగా వృథాగా ఉంది. నిత్యం పలు రకాల పనుల మీద జిల్లాధికారి కార్యాలయానికి వచ్చే ప్రజలు దప్పిక తీర్చుకోవడానికి నానాపాట్లు పడుతున్నారు. చుట్టుపక్కల ఉన్న హోటళ్లకు వెళ్లి దాహం తీర్చుకోవాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. గతంలో కలెక్టరేట్లో ప్రజల కోసం మంచినీటి కోసం ఎలాంటి వ్యవస్థ అందుబాటులో లేదు. పత్రికలు, మీడియాలో వెలువడిన వార్తాకథనాలతో మేల్కొన్న జిల్లాధికార యంత్రాంగం లక్షలాది రూపాయలు వెచ్చించి కార్యాలయ ప్రవేశ ద్వారంలోనే ఆర్ఓ ప్లాంటును ప్రారంభించింది. దీంతో ప్రజలకు ఎంతో అనుకూలం అయింది. అయితే ఇటీవల గత కొన్ని రోజులుగా కేంద్రానికి నీరు సరఫరా కాని కారణంగా తాగునీరు అందడం లేదని పలువురు తెలిపారు. సత్వరం మంచినీటిని ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment