కారు బీభత్సం
తుమకూరు: జిల్లాలోని తిపటూరు పట్టణంలోని బస్టాండ్ లింక్ రోడ్డులో ఓ కారు బీభత్సం సృష్టించింది. వివరాలు.. సోమవారం రాత్రి కేఏ–05 ఎంటీ–7488 నంబరుగల కారును అతివేగంగా నడపడంతో అదుపు తప్పి చెట్టును ఢీకొని అంతే వేగంతో కారు పక్కనే ఉన్న షెడ్పైకి దూసుకెళ్లింది. కారులోని వారు దానిని వదిలేసి వెళ్లిపోయారు. స్థానికులు, పోలీసులు మంగళవారం ఉదయం చూసి క్రేన్ సహాయంతో కారును కిందకు దించారు. రాత్రి వేళ ఈ ప్రమాదం జరగడంతో జన సంచారం లేనందున ప్రాణాపాయం జరగలేదు. ఎవరో తాగిన మైకంలో కారు నడపడమే కారణమని అనుమానాలున్నాయి. తాగుబోతు డ్రైవర్ల ఆటకట్టించేలా పోలీసు అధికారులు గట్టి చర్యలు చేపట్టాలని ప్రజలు కోరారు. కారు సొంతదారు కోసం పోలీసులు విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment