మెట్రో వంతెన ముక్కలు తగిలి..
బనశంకరి: ఐటీ సిటీలో మెట్రో రైలు వంతెనల కింద నుంచి వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి, లేదంటే రాయి రప్ప తగిలి గాయాలయ్యే ప్రమాదం ఉంది. ఇదే రీతిలో సిమెంట్ ముక్కలు పడటంతో కారు అద్దాలు పగిలాయి. ఈ ఘటన మైసూరు రోడ్డులో మంగళవారం చోటుచేసుకుంది. నవీన్‌రాజ్ అనే వ్యక్తిలో కారులో వెళుతుండగా మెట్రో బ్రిడ్జి నుంచి సిమెంట్ ముక్కలు ఊడిపడ్డాయి. కారు అద్దాలు దెబ్బతిన్నాయి, కారులోని వారికీ ఏమీ కాలేదు. మైసూరు రోడ్డు పిల్లర్ 393 వద్ద ఈ ఘటన జరిగింది. ఎస్‌యువి 700 కొత్త కారు కొని నెల కూడా కాలేదు. కారు దెబ్బతింది, మెట్రో అధికారులు పరిహారం చెల్లించాలని యజమాని మండిపడ్డారు. ఆయన బ్యాటరాయనపుర ఠాణాలో ఫిర్యాదు చేశారు.
రాజ్యాంగమే
దారి దీపం: సీఎం
శివాజీనగర: కుల వ్యవస్థ ద్వారానే అసమానత్వం– మానవత్వ లోపం ఏర్పడింది, రాజ్యాంగ వ్యతిరేకులు, మను స్మృతిపై జాగ్రత్తగా ఉండాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. నగరంలో సాంఘిక సంక్షేమ శాఖ అంబేడ్కర్ భవన్‌లో నిర్వహించిన రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా రాజ్యాంగం ప్రకారమే నడచుకోవాలన్నారు. రాజ్యాంగ విలువలను పాలించేవారి చేతిలో ఈ రాజ్యాంగం ఉన్నప్పుడే సార్థకతమవుతుందని అంబేడ్కర్ చెప్పేవారన్నారు. బడుగులకు రాజకీయ స్వాతంత్య్రంతో పాటుగా ఆర్థిక స్వాత ంత్య్రాన్ని కల్పించాల్సి ఉందన్నారు. దేశంలో ఉన్న రాజ్యాంగ వ్యతిరేకుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. గతంలో బీజేపీ కేంద్రమంత్రి అనంతకుమార్ హెగ్డే రాజ్యాంగాన్ని మారుస్తామంటే ప్రధాని మోదీ మౌనంగా ఉన్నారన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ అధికారులను సన్మానించారు.
మహిళా రైతు ఆత్మహత్య
మండ్య: అప్పుల బాధలు తట్టుకోలేక మహిళా రైతు ప్రాణాలు తీసుకుంది. జిల్లాలోని మళవళ్లి తాలూకా తమ్మడహళ్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. వివరాలు.. కెంపయ్య భార్య కెంపమ్మ (50). ఆమె ఎకరా పొలంలో వ్యవసాయం చేసేది. ఇందుకోసం సీ్త్ర శక్తి సంఘాలతో పాటు ప్రైవేట్ వ్యక్తుల నుంచి సుమారు రూ.4 లక్షలకు పైగా అప్పులు తీసుకుంది. పంటలు పండకపోవడంతో అప్పులు తీర్చే మార్గం లేకపోయింది. ఆవేదనతో కెంపమ్మ సోమవారం పొలంలో పురుగు మందు తాగి పడిపోయింది. ఇతర రైతులు గమనించి ఆమెను మండ్యలోని మిమ్స్ ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలో చనిపోయింది.
మునిరత్న ఆడియో అసలైనదే
దొడ్డబళ్లాపురం: కుల దూషణ కేసులో అరైస్టె జైలుకు వెళ్లి బెయిలుపై బయటకు వచ్చిన బెంగళూరు ఆర్‌ఆర్ నగర బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న కేసులో ఫోరెన్సిక్ నివేదిక వచ్చింది. కొన్ని కులాల్ని నిందిస్తూ మునిరత్న మాట్లాడిన ఆడియోను పోలీసులు ఎఫ్‌ఎస్‌ఎల్‌కు తరలించగా ఆడియో నిజమైనదే అని నిపుణులు తేల్చారు. మునిరత్న కాంట్రాక్టర్ చెలువరాజుతో మాట్లాడుతూ కులాలను దూషించారు. చెలువరాజును కులం పేరుతో తిట్టారని, ఈ ఆడియోతో మాజీ కార్పొరేటర్ వేలునాయక్ వైయాలికావల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని మునిరత్నను అరెస్టు చేయడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment