విదేశీ డ్రగ్ పెడ్లర్ అరెస్టు
బనశంకరి: బెంగళూరులో డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతున్న విదేశీయున్ని సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతడి వద్ద నుంచి రూ.77 లక్షల విలువ చేసే ఎండీఎంఏ క్రిస్టల్స్‌ని స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీస్ కమిషనర్ బీ.దయానంద్ తెలిపారు. మంగళవారం కేసు వివరాలను ఆయన వెల్లడించారు. ఆఫ్రికా ఖండంలోని ఐవరి కోస్ట్ దేశానికి చెందిన కోవ్సిజూల్స్ ఎన్‌గెసన్ (36) ఈ నెల 22వ తేదీన సూలదేవనహళ్లి ఆర్‌ఆర్ కాలేజీ రోడ్డులో డ్రగ్స్‌ను అమ్ముతుండగా పోలీసులు దాడిచేసి పట్టుకున్నారు. ఇతడు 2017లో బిజినెస్ వీసాతో భారత్‌కు వచ్చాడు. జల్సాలు, అధిక సంపాదన కోసం బెంగళూరులో డ్రగ్స్ అమ్మకాలు ప్రారంభించాడు. ఒక గ్రాము ఎండీఎంఏ క్రిస్టల్స్‌ని రూ.12 వేల నుంచి 15 వేల ధరతో కాలేజీ విద్యార్దులు, ఐటీబీటీ ఉద్యోగులకు అమ్మేవాడు. అతని నుంచి 515 గ్రాముల ఎండీఎంఏ, మొబైల్ ఫోన్లు తదితర రూ.77 లక్షల విలువచేసే సరుకును సీజ్ చేశారు.
ఇద్దరి నుంచి గంజాయి స్వాధీనం
రాబోయే న్యూ ఇయర్ వేడుకల్లో అమ్మడానికి నిల్వచేసిన రూ.7.50 లక్షలు విలువచేసే 10 కిలోల గంజాయిని మారతహళ్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్‌వాసి బిజయకుజుర్ (24) ని అరెస్ట్‌చేశారు. అసోం నుంచి గంజాయి తీసుకొచ్చి ఓ షెడ్డులో ఉంచాడు. సమాచారం తెలిసి అరెస్టు చేశారు. బెల్లందూరువాసి అబుల్ బిన్ కలాం (34) సంపిగేహళ్లి పోలీసులు అరెస్ట్‌చేశారు. ఇతడి వద్ద నుంచి రూ.2 లక్షల విలువచేసే 4 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
రూ. 77 లక్షల మత్తు పదార్థాలు సీజ్
Comments
Please login to add a commentAdd a comment