తీయని అరటి.. వైవిధ్యంలో మేటి
మైసూరు: నాలుగైదు రకాల అరటి పండ్ల గురించే ఎక్కువమందికి తెలుసు, కానీ 150 కి పైగా అరటి పండ్లు ఉన్నాయని తెలిసింది కొందరికే. వాటిని ఎప్పుడూ చూడలేదు, తినలేదే అని సందర్శకులు ఆశ్చర్యపోతున్నారు. మైసూరు నగరంలోని నంజ బహదూర్ సత్రంలో మూడురోజుల అరటి మేళా ప్రజలకు కనువిందు చేస్తోంది. వైవిధ్య రకాల అరటి పండ్లను రైతులు ప్రదర్శనకు తీసుకొచ్చారు. మామిడి, పనస మేళా మాదిరిగా అరటి మేళా నిర్వహించడం ఉపయుక్తంగా ఉందని సందర్శకులు తెలిపారు. ఇందులో 120 రకాల కదళీ ఫలాలను చూడవచ్చు. కర్ణాటక నుంచే కాకుండా తమిళనాడు, కేరళ, ఏపీ, బిహార్‌ల నుంచి కూడా రైతులు అరటి కాయలు, పండ్లను తీసుకొచ్చారు. ఎరుపు, బీజకోళ, ఉదయవర, మన్నన్, మునవర్, అల్సా గొడ్న, సాబా, ఐఐటిఎ –75, సిబి–1, కరీంబళ, దేశ కందళి, విరూపాక్షి, బిహార్ గౌరియా, రసతాళి, పూవన్, చక్కెరకేళి, బీమ్ కేల్, నేంద్ర, నిజలి ఫూవన్, కర్పోరవలి ఇలా పెద్ద జాబితానే అవుతుంది. అలాగే కూరలకు, ఒడియాలకు పనికివచ్చే అరటి రకాలను చాలా ప్రదర్శించారు.
మైసూరులో 120 రకాల ప్రదర్శన
Comments
Please login to add a commentAdd a comment